వాయుగుండం ప్రభావంతో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.. శ్రీకాకుళం. విజయనగరం. విశాఖ. అల్లూరి. అనకాపల్లి. కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ హెచ్చరించారు.. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.. భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.. విజయవాడలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలో ఈదురు గాలులతో కూడిన వర్షం. ప్రకాశం జిల్లాలో ఈదురు గాలుల ప్రభావంతో భారీ వృక్షం నేలకొరిగింది. కర్నూలు జిల్లాలో కురిసిన గాలివానకు పవన విద్యుత్ ఫ్యాన్ల క్రేన్ కూలిపోయాయి. కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభం. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షానికి కూలిన పోయిన భారీ వృక్షం