తెలంగాణ

telangana

ETV Bharat / photos

లాస్ ​ఏంజెలెస్​లో ఆగని కార్చిచ్చు- కొన్ని గంటల్లో 8వేల ఎకరాలు బుగ్గి - LOS ANGELES FIRE UPDATE

Los Angeles Wildfire : అమెరికాలోని లాస్​ఏంజెలెస్​లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు ఇంకా తగ్గడం లేదు. తాజాగా మరో ప్రాంతంలో కొత్తగా మంటలు విజృంభించాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాస్టాయిక్‌ లేక్‌ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇవి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 8వేలకు పైగా ఎకరాలకు వ్యాపించినట్లు వెల్లడించారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 12:22 PM IST

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెలిస్​ను అతలాకుతలం చేసిన కార్చిచ్చు ఇప్పుడు మరొక ప్రాంతానికి విస్తరించింది. దీంతో కాస్టాయిక్ లేక్ సమీపంలో ఈ మంటలు కొన్ని గంటల వ్యవధిలోనే 8వేలకు పైగా ఎకరాలకు వ్యాపించాయి. (Associated Press)
మంటలు తీవ్రంగా వ్యాపించడం వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. (Associated Press)
కాస్టాయిక్‌ లేక్‌ సమీపంలో బుధవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. (Associated Press)
కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్నికీలలు 39 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను, పొదలను బూడిద చేశాయని అధికారులు తెలిపారు. (Associated Press)
తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్‌, పాలిసేడ్స్‌కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. (Associated Press)
అంతేకాకుండా దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ఇబ్బందికరంగా మారాయి. (Associated Press)
గాలులు బలంగా వీస్తుండటం వల్ల మంటలు ఒక చోటు నుంచి మరో చోటుకు వేగంగా అంటుకుంటున్నాయి. (Associated Press)
అగ్నికీలల తీవ్రత దృష్ట్యా మంటలను అదుపు చేయడం అతి కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. (Associated Press)
అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. (Associated Press)
తాజా కార్చిచ్చుతో దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు నివాసాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. (Associated Press)
ప్రస్తుతం ఇక్కడ గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు ప్రకటించారు. (Associated Press)
గురువారం నాటికి ఇది గంటకు 96 కిలోమీటర్లకు పెరగొచ్చని అంచనా. (Associated Press)
ఇప్పటికే విమానాలతో వాటర్‌ బాంబులను జారవిడుస్తూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. (Associated Press)
కాగా, ఇటీవల లాస్‌ఏంజెలెస్‌లోని హాలీవుడ్‌ సహా పలు ప్రాంతాల్లో భీకర కార్చిచ్చు చెలరేగింది. (Associated Press)
ఆ మంటల ధాటికి 14వేల నిర్మాణాలు బూడిద అయ్యాయి. 28 మంది ప్రాణాలు విడిచారు. (Associated Press)
పాలిసేడ్స్‌లో మంటలను 68శాతం, ఈటన్‌లో ఫైర్‌ను 91 శాతం అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కానీ, బలమైన గాలుల కారణంగా మంటలు మళ్లీ విజృంభిస్తున్నాయి. (Associated Press)
లాస్​ఏంజెలెస్​ కార్చిచ్చు (Associated Press)
లాస్​ఏంజెలెస్​ కార్చిచ్చు (Associated Press)
లాస్​ఏంజెలెస్​ కార్చిచ్చు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details