ఎండాకాలంలో రోజంతా మేకప్ చెక్కుచెదరకుండా ఉండాలంటే ఈ 6 పాయింట్స్ తప్పక ఫాలో అవ్వండి.. ఈ వేసవిలో హెవీ ఫౌండేషన్‌కి బాయ్ బాయ్ చెప్పేయండి. సింపుల్ మాయిశ్చరైజర్‌కి స్వాగతం పలకండి. మీకు నప్పే లిక్విడ్ ఫౌండేషన్‌కు కాస్త మాయిశ్చరైజర్ జతచేసి ముఖానికి అప్లయ్ చెయ్యండి. ఇది ముఖానికి సహాజత్వాన్ని ఇస్తుంది.. మేకప్‌ను చెదరనివ్వని సెట్టింగ్ స్ప్రేను ఇంట్లోనే తయారు చేసుకోండి. స్ప్రే బాటిల్లో మంచినీటికి కాస్తంత గ్లిజరిన్ లేక ఆలోవెరా జెల్‌ను కలపండి. మేకప్ పూర్తి అయిన వెంటనే ఇది స్ప్రే చేసుకోండి.. నిమ్మకాయలో ఉండే సిట్రస్ యాసిడ్ మీ పెదాలను సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. బయటనుంచి వచ్చే రంగులా కాకుండా ఇది పెదవులను లోపలి నుంచి గులాబీ రంగులోకి మారుస్తుంది. అందుకే పెదవులకి నిమ్మరసాన్ని అప్లై చెయ్యండి.. కీరదోసను ముక్కలుగా చేసి కళ్లమీద పెట్టుకుంటే కళ్ల మంటలు. సమస్యలు తగ్గుతాయి. కళ్ళు ఉబ్బినట్లు అనిపిస్తే కీరదోసకాయ ముక్కలను కాసేపు ఫ్రీడ్జ్‌లో ఉంచి తరువాత కళ్ళపై పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది.. శరీరపు రంగుకు. తగిన బ్రోంజర్‌ను మీరే స్వయంగా తయారుచేసుకోండి. కోకో పౌడర్. దాల్చినచెక్క ఇంకా కార్న్ ఫ్లోర్లని మీకు నచ్చిన షేడ్ వచ్చేవరకు కలిపి దానిని బుగ్గలు. నుదురు. ముక్కు భాగాలలో రాయాలి.. రోజ్ వాటర్ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. తాజా గులాబీ రేకులను నీళ్ళలో వేసి తక్కువ మంటపై మరిగించాలి. నీరు గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక. సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకొని అవసరానికి వాడుకోవచ్చు.