తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఎటు చూసినా శిథిలాలే- రోడ్డున పడ్డ 12లక్షల మంది- లెబనాన్​లో సీజ్​ ఫైర్​ తర్వాత పరిస్థితులిలా! - LEBANON PRESENT SITUATION

ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లా మధ్య పోరులో భారీ నష్టం వాటిల్లింది. లెబనాన్‌లో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోగా 850 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. హెజ్‌బొల్లా అగ్రనేతలు సహా 2500 మంది హెజ్‌బొల్లా ఫైటర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెబుతోంది.12లక్షల మంది ఈ యుద్ధం కారణంగా నిరాశ్రయులయ్యారు. ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వల్ల లెబనాన్‌ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 3:53 PM IST

Lebanon Present Situation : ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య జరిగిన పోరు లెబనాన్‌కు అపారనష్టాన్ని మిగిల్చింది. (Associated Press)
ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వల్ల పశ్చిమాసియా కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఈ ఒప్పందం లెబనాన్‌కు పెద్ద ఊరటనివ్వనుంది. (Associated Press)
ఎందుకంటే హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ బలగాలు చేసిన దాడుల్లో అత్యధికంగా నష్టపోయింది లెబనానే. (Associated Press)
గాజాలో హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేయగా ప్రతిగా ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో లెబనాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. (Associated Press)
14 నెలలపాటు ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో లెబనాన్‌లో 4 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. (Associated Press)
ఇందులో అత్యధికంగా సాధారణ పౌరులే ఉన్నారు. దాదాపు 16 వేల మంది గాయపడ్డారు. (Associated Press)
2006లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం కంటే ఈ మృతుల సంఖ్య 10 రెట్లు అధికం. (Associated Press)
అనేక మంది హెజ్‌బొల్లా అగ్రనేతలను వైమానిక దాడుల్లో ఇజ్రాయెల్‌ హతమార్చింది. (Associated Press)
లెబనాన్‌లో 12 లక్షల మంది ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లను వదిలివెళ్లి నిరాశ్రయులుగా మారారు. (Associated PressAssociated Press)
వీరిలో ఎక్కువ మంది హెజ్‌బొల్లా స్థావరాలు కలిగిన ప్రాంతాల్లో నివసించేవారే. (Associated Press)
లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ 14 వేలకుపైగా దాడులు చేసింది. (Associated Press)
దాదాపు 2500 మంది హెజ్‌బొల్లా ఫైటర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెబుతోంది. (Associated Press)
లక్ష ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి. (Associated Press)
దీని ద్వారా 280 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. (Associated Press)
మొత్తంగా ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా లెబనాన్‌లో 850 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంక్‌ అంచనా. (Associated Press)
1982లో హెజ్‌బొల్లాను ఏర్పాటు చేసిన ఇరాన్‌ ఇప్పుడు లెబనాన్‌లో పునర్నిర్మాణానికి కూడా సాయం అందిస్తామని చెబుతోంది. (Associated Press)
మరోవైపు అనేక మంది హెజ్‌బొల్లా అగ్రనేతలను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. (Associated Press)
వారి వద్ద ఉన్న రాకెట్లు అన్నింటినీ దాదాపు ధ్వంసం చేశామని, వేలాది మంది హెజ్‌బొల్లా ఫైటర్లను హతమార్చామని ప్రకటించారు. (Associated Press)
ఇజ్రాయెల్‌తో సరిహద్దుల్లో హెజ్‌బొల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను నాశనం చేసినట్లు తెలిపారు. (Associated Press)
సైనికపరంగా, రాజకీయపరంగా ప్రస్తుతం హెజ్‌బొల్లా అత్యంత బలహీనంగా ఉందని అమెరికాకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. (Associated Press)
హెజ్‌బొల్లాతో పోరు కారణంగా ఇజ్రాయెల్‌ కూడా కొంతమేర నష్టపోయింది. (Associated Press)
80 మందికిపైగా ఇజ్రాయెల్‌ సైనికులు, 47 మంది ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. (Associated Press)
ఇజ్రాయెల్‌లో దాదాపు 5,683 ఎకరాల మేర పంటలు, చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. (Associated Press)
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా 2 వేలకుపైగా దాడులు చేసింది. (Associated Press)
ఫలితంగా లెబనాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 60 వేల మంది ఇజ్రాయెల్‌ పౌరులు తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details