Pratidhwani : ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు పోలింగ్ చిట్టచివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఏడాదికాలంగా హోరాహోరీగా, ఉద్ధృతంగా సాగిన ఎత్తులుపైఎత్తుల ఫలితాలపై కొన్ని గంటల్లోనే స్పష్టత రానుంది. అగ్రరాజ్యం చరిత్రలో మొదటిసారి మహిళా ప్రెసిడెంట్‌ను చూస్తామా? తెంపరి ట్రంప్‌కు అంకుల్ శామ్ రెండో అవకాశం ఇస్తారా అన్నది ఇక తేలి పోనుంది. మరి చివరి దశ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఫైనల్ ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి?
మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు జో బైడెన్ వారసురాలిగా దూసుకుని వచ్చిన కమలాహారీస్‌లో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? అంతిమ ఓటింగ్‌ను ప్రభావితం చేస్తోన్న అంశాలు ఏమిటి? ఇప్పటి కే ప్రారంభమైన ఓటింగ్ సరళి ఏం చెబుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు జార్జ్ మాసన్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ప్రొ. మోహన్ వీ, రాజకీయ పరిశీలకులు, వాషింగ్టన్ సియాటెల్ నివాసి అభినయ్ సామా.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల ఫలితాలు కూడా వస్తున్నాయి అంటున్నారు. ఈ రేసులో ట్రంప్ - కమలాహారిస్‌లో ఎవరు ఎక్కడ ఉన్నారు? అధ్యక్ష ఎన్నికలపై ఫైనల్ ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం కొనసాగుతున్న, ముగిసిన రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ సరళులు ఏం చెబుతున్నాయి? ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? అమెరికా ఎన్నికల్లో మొదట్నుంచీ ఇప్పుడు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్వింగ్ స్టేట్స్. వాటిల్లో ప్రస్తుతం సమీకరణాలు ఎలా కనిపిస్తున్నాయి? ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, డెమెక్రాట్ల అవకాశాల్లో ఎవరు ముందున్నారు?