Pratidhwani Debate on Delhi Verdict : దేశ రాజధానిలో చరిత్ర తిరగరాశారు దిల్లీ ఓటర్లు. సుమారు 27ఏళ్ల తర్వాత కమలదళానికి సునామీలాంటి విజయం అందించారు. విస్పష్టమైన ఆధిక్యంతో అధికారం అప్పగించారు. అధికార ఆమ్ ఆద్మీ మూలాలు కదిలిపోయాయి. శతాధిక పార్టీ కనీసం ఖాతా తెరవలేదు. కేజ్రీవాల్ సహా ఆప్‌లో కీలకనేతల కోటలు కొట్టుకు పోయాయి. మరి దిల్లీలో ఆప్ జైత్ర యాత్రకు అడ్డుకట్ట వేసిన, చాలాకాలం తర్వాత బీజేపీకు సీఎం పీఠం అందించిన అంశాలేంటి? ఆమ్ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖం అనుకున్న పోరులో అసలేం జరిగింది?
ఓటర్లు కాంగ్రెస్‌ను కనీసం పరిగణనలోకి తీసుకోక పోవడానికి కారణాలేంటి? ఇంతకాలంగా అసెంబ్లీకి ఆప్, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అంటున్న దిల్లీ ప్రజల తీర్పులో ఇంత మార్పు ఎందుకు? ఈ ఫలితాల్లో మూడు పార్టీలకు పాఠాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు 1. ఆర్. భరత్ భూషణ్(రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్) 2. పి. కృష్ణప్రదీప్(జాతీయ రాజకీయాలపై నిపుణులు, హైదరాబాద్)