ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

5 ఏళ్లు చీకట్లో మగ్గిన రాష్ట్రానికి మళ్లీ శుభసూచికలు-దావోస్ నుంచి ఏపీకి పెట్టుబడుల బాట! - PRATIDHWANI CM DAVOS TOUR

దావోస్‌లో మరోసారి సీఎం చంద్రబాబు చారిత్రక పాత్ర - లక్షల మందికి ఉపాధి కల్పించేలా రూ.వేలకోట్ల పెట్టుబడులు-తమదైన అనుభవంతో ఆకర్షిస్తున్న చంద్రబాబు బృందం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2025, 10:11 AM IST

Pratidhwani :కిమ్ పాలనలో ఉత్తర కొరియాలాగా తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లాగా గత 5 ఏళ్లు చీకట్లో మగ్గిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మళ్లీ శుభసూచికలు కనిపిస్తున్నాయి. పొలో అంటూ రాష్ట్రం వదిలి పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు హలో అంటూ మళ్లీ మన రాష్ట్రానికి వస్తున్నారు. 45 ఏళ్ల వయస్సులోనే చీఫ్‌ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టి ప్రపంచ నాయకులను, పారిశ్రామికవేత్తలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా చేసిన ట్రాక్ రికార్డు చంద్రబాబుది.

దావోస్‌లో ఆయన మరోసారి చారిత్రక పాత్ర పోషిస్తున్నారు. లక్షలమందికి ఉపాధి కల్పించేలా వేలాదికోట్ల పెట్టుబడులను తనదైన అనుభవంతో ఆకర్షిస్తున్నారు. విజనరీ లీడర్‌గా తనకున్న గ్లోబల్ ఇమేజితో దిగ్గజ పరిశ్రమలను ఏపీకి రప్పిస్తున్నారు. దావోస్‌ పర్యటన వల్ల ఏపీకి కలిగిన లాభం ఏంటి? కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవి? ఇదీ నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ నరేష్‌. క్రియోటో సొల్యూషన్స్ సీఎండీ కరణం ప్రసాద్.

గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు ఏపీ హబ్‌గా మారబోతోంది: సీఎం చంద్రబాబు
దావోస్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు అక్కడికి ఏపీ, తెలంగాణ సీఎంలు వెళ్లారు? అక్కడికి వెళ్లటం వలన ఏపీకి కలిగే ఉపయోగం ఏంటి? ఇప్పుడు నరేష్‌ గారు చెప్పిన దానిని బట్టి చూస్తే చంద్రబాబునాయుడు గారికి ఉన్న గ్లోబల్ ఇమేజి కూడా పెట్టుబడులు ఏపీకి రావటానికి ఒక కారణంగా భావించవచ్చా? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్‌టైం సీఎం అయినప్పుడే 40 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ప్రముఖులను, ప్రముఖ కంపెనీలను తీసుకుని వచ్చారు. ఆ ట్రాక్ రికార్డు ఇప్పుడు ఏ మేరకు ఉపయోగపడుతోంది?

ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇండస్ట్రీయిల్ డెవలెప్‌మెంట్ పాయింట్ ఆఫ్‌ వ్యూలో చూస్తే 2014 – 2019 మధ్య కాలాన్ని, 2019 – 2024 మధ్య కాలాన్ని మీరు కంపేర్ చేస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఏఏ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి? ఇంకా ఏవేం రాబోతున్నాయి? ఇప్పటికే హైదరాబాద్‌ ఎస్టాబ్లీష్‌ అయి ఉండగా ఏపీకి ప్రత్యేకంగా పెట్టుబడులు రావటానికి ఎలాంటి ప్రయత్నాలు అవసరం? ఈ విషయంలో మన ప్రభుత్వ చొరవ ఎలా ఉంది?

రాబోయే 5 ఏళ్లలో ఏపీలో ఏఏ ప్రాంతాల్లో ఏఏ పరిశ్రమలు రావటానికి అవకాశం ఉంది. మనకి ఉన్న సహజ సిద్ధమైన అవకాశాలు ఏంటి? రాబోయే 5 ఏళ్లలో ఏపీ ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ను మీరు ఎలా అంచనా వేస్తున్నారు? పొరుగు రాష్ట్రాల కంటే మనకి ఎక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వంటి అంశాల గురించి సమగ్ర సమాచారం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే టార్గెట్ - దావోస్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details