Prathidwani Debate on CM YS Jagan Mohan Reddy: ప్రతి వ్యక్తికీ సంస్కారం, హుందాతనం అవసరం. కోట్లాదిమందికి నేతృత్వం వహించే పదవిలో ఉండేవారికి ఆ కనీసార్హతలు తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద. ఆ సీఎం కుర్చీలో కూర్చునే వ్యక్తి ప్రవర్తన, మాటతీరు, స్వభావం, వ్యక్తిగత ప్రతిష్ఠ వీటన్నింటిపై ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సీఎం అవటం కోసం జగన్ ఏవేం చెప్పారు? సీఎం అయ్యాకా ఏవేం చేశారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తిలా నడుచుకుంటున్నారా? మరోసారి ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఆయనకు ఉందా? ఈ అయిదేళ్ల అనుభవాలు ఏం చెబుతున్నాయి? దీనిపై రాజకీయ విశ్లేషకులు నూర్ మహ్మద్, ఏపీ పరిరక్షణ సమితి యూత్ వింగ్ అధ్యక్షుడు ఆర్.సాయికృష్ణలు పలు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి చంపండి అని గతంలో జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు గురించి జగన్ హింసను ప్రేరేపించేలా మాట్లాడారు. నాలుకపై అదుపులేని వ్యక్తి చేతిలో అధికారం పెట్టడం వల్ల ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? అదే దానిపై రాజకీయ విశ్లేషకులు నూర్ మహ్మద్ తన అభిప్రాయాన్ని తెలిపారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి విధ్వంస పాలనను సాగిస్తున్నారని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ మంత్రులు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? - వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు?