Prathidwani :మొన్నటికి మొన్నే ఒకచోట బీజేపీ మరోచోట ఇండియా కూటమి తమ బలం ఏంటో చాటుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే బోర్లా పడ్డాయి. సార్వత్రిక సమరం మొదలు 2 రాష్ట్రాల ఫలితాల రోజు వరకు కూడా ఎవరూ ఊహించని పరిణామం అది. సరిగ్గా వారం తరవాత ఇప్పుడు మరో 2 రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.
వచ్చే నెల 13, 20 తేదీల్లో పోలింగ్ పూర్తిచేసి 23న ఫలితాలని షెడ్యూల్ వెల్లడించి ఎన్నికల సంఘం. ఈ సారి రేసు గెలిచేది ఎవరు? మరీ ముఖ్యంగా మహారాష్ట్ర మల్లయుద్ధంలో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మధ్య సమీకరణాలు ఎలా ఉండ బోతున్నాయి? జాతీయ రాజకీయాలకు ఇదేమైనా కొత్త దిక్కు చూపిస్తుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, రాజకీయ విశ్లేషకులు డా. వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
'మహా' ఎన్నికలపైనే అందరి ఫోకస్- 6పార్టీలకు పెద్ద సవాల్- ప్రజాకోర్టులో మద్దతు ఎవరికో?
Maharashtra Assembly Election 2024 :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చనున్నారు. మొత్తంగా ఆరు పార్టీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్), కాంగ్రెస్‌కు ఇది అగ్ని పరీక్షే. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి.