ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

రైతు ప్రభుత్వమని గొప్పలు - కర్షకులకు తప్పని కన్నీరు

Government Delay Payment to Farmers : ధాన్యం సొమ్ము చెల్లింపు జాప్యంపై కృష్ణాజిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ-పంట విధానంలో నమోదు చేసుకుని, ప్రభుత్వం సూచించిన విధంగానే ఆర్బీకేలకు ధాన్యం సరఫరా చేసి నెలన్నర గడుస్తున్నా, తమ ఖాతాల్లో నగదు జమ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

govt_delay_payments
govt_delay_payments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 10:56 AM IST

రైతు ప్రభుత్వమని గొప్పలు - కర్షకులకు తప్పని కన్నీరు

Government Delay Payment to Farmers :తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం కర్షకులకు కన్నీరు పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర ఇవ్వకపోగా రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికీ చెల్లింపులు చేయట్లేదు.డబ్బులు ఎప్పుడు వస్తాయా అని కృష్ణా జిల్లాలో అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.

కష్ట కాలంలో మల్లె రైతులు - పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్న కర్షకులు

కృష్ణా జిల్లాలో గడిచిన ఖరీప్‌లో దాదాపు 34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. సాగునీటి కొరత, అకాల వర్షాలు, తుపాను ప్రభావంతో ఆశించిన దిగుబడులు రాలేదు. కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కుతాయని రైతులు ఆశించారు. దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇచ్చిన ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదు. తడిసిన, బాగున్న ధాన్యానికి వివిధ కుంటిసాకులతో అర్బీకేల్లో కొర్రీలు వేశారు. ఇది చాలదన్నట్లు ఆర్బీకేల్లో నిర్ధారించిన ధరను చాలా మంది మిల్లర్లు చెల్లించకపోవడంతో రైతులు మరింత నష్టపోయారు.

జగన్ హయాంలో అన్నదాతల అవస్థలు - ప్రభుత్వ నిర్వాకంతో ఏటికేడూ కాడి వదిలేస్తున్న రైతులు
ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో వారి ఖాతాలకు నగదు జమ చేస్తామన్న హామీ ఆచరణలో అమలు కావడం లేదు. ఖరీప్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాక ఇప్పటి వరకు రూ. 890 కోట్లకు పైబడిన విలువ చేసే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించారు. రైతులకు చెల్లించాల్సిన నగదులో గత నెల రెండో వారం వరకు చేసిన చెల్లింపులు 69 శాతానికి లోబడే ఉన్నాయి. ఇంకా దాదాపు 250 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఉండడం రైతులను అమోయమానికి గురి చేస్తోంది.

"వర్షం మూలంగా పంట దిగుబడి తగ్గింది. ఎలాగోలా కష్టపడి పంటను పండించి రైతు భరోసా కేంద్రానికి వేస్తే డబ్బులు ఇంతవరకు రాలేదు. అందుకే రైతుల్లో ఆందోళన పెరిగిపోతుంది. పంటలు పండించడానికి రైతులు అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులకు బయట వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎరువులకు, పురుగుమందులకు అంటూ రైతులు అదనంగా పెట్టుబడి పెట్టారు. పంట పండించడానికి చేసిన అప్పులను తీర్చడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు"-రంగరావు, రైతు సంఘం నాయకుడు

చిన్న, కౌలు రైతులకు కనీస పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర విషయంలోనూ రాజీపడి విక్రయించినా నగదు సకాలంలో చెల్లింకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రెండో పంటకు అవసరమైన ఎరువులు, పురుగుమందులకు పెట్టుబడి లేక కొందరు గాలికొదిలేశారు. మరికొందరు రెండో పంట ద్వారా అయినా చేసిన అప్పులు తీర్చాలని మళ్లీ అప్పులు చేసి మినుము, పెసర పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్, రబీకి పెట్టుబడులకు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగిపోవడంతో తమకేం చేయాలో ఆర్ధం కావడం లేదని రైతులు వాపోతున్నారు.

'ఎండిన పైరు రైతు కంట నీరు' - పంటను కాపాడుకోడానికి ఆలుపెరగని పోరాటం

ABOUT THE AUTHOR

...view details