Pratidhwani :రాష్ట్రం బాగుంటే ఇప్పుడున్న మనమే కాదు మన తర్వాతి తరాలు కూడా బాగుంటాయి. దానికి బీజాలు ఇప్పుడే వేయాలి. అలా చేయగల సమర్థుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 'అభివృద్ధి ఎవరిది ? వినాశనం ఎవరిది ?' అనే అంశంపై ప్రతిధ్వనిలో చర్చించానికి హైదరాబాద్ నుంచి సామాజిక విశ్లేషకులు ఏ శ్రీనివాసరావు, గుంటూరు నుంచి రాజకీయ విశ్లేషకులు ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.
జగన్ వర్సెస్ చంద్రబాబు :శ్రీనివాసరావు మాట్లాడుతూ 'సిద్ధం' సభలు పెట్టి ప్రజలపైయుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తాను చేసిన అభివృద్ధి గురించి ఎక్కడా వివరించడం లేదుని, అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌కు అంగీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరని అన్నారు. రాజకీయ విమర్శలకు సిద్ధం సభలను వేదికగా చేసుకుంటున్నారే తప్ప అభివృద్ధిపై కాదని. జగన్ తన తండ్రి అధికారం సాయంతో లక్షల కోట్ల రూపాయలు కొట్టేశారని. సత్యం రామలింగరాజు వంటి వారిని జైలుపాల్జేశారని తెలిపారు. కులం పేరుతో ఎదుటివారిపై నిందలు మోపారని అన్నారు.
ఏపీలో తాలిబాన్లను మించిన అరాచక రాజ్యం - మరొక అవకాశం ఇస్తే పరిస్థితి ఏంటి?
జగన్ తన సొంత బాబాయి హత్యకు గురైతే ఎదుటివారి చతులకు నెత్తురు పూసి తన పత్రికలో వ్యతిరేక కథనాలు ప్రచురించారని పేర్కొన్నారు. ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసని అన్నారు. అందరి కంటే 20 ఏళ్ల ముందు చూపుతో చంద్రబాబు నాయడు అలోచన చేస్తారన్నారు. ఏ పాలకుడికయినా ఉండాల్సిన దార్శనికత ఇదేన్నారు. చంద్రబాబులో నిరంతరం కష్టపడే గుణం, సంస్కరణల ఆకాంక్ష, దూరదృష్టి, తాను తీసుకునే నిర్ణయాలకు వెంటనే కాకపోయినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనే విశ్వాసం ఉంటాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, ఆపదలప్పుడు ఆయన స్పందన మెరుపు వేగంతో ఉంటుందన్నారు. అతి తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాలో సూక్ష్మసేద్య విధానం ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారన్నారు. ఆయన తర్వాత జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టును పడకేయించారని, రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు సరికదా, ఉన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.