ETV Bharat Prathidwani :ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రా యువతకు ఏం ఒరిగింది? చదువుకున్న యువతకు ఉద్యోగాలు వచ్చాయా? 2019లో యువభేరీలు పెట్టి యువతను ఎలా మభ్యపెట్టారు? ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో జగన్ యువతను ఎలా మోసం చేశారు? యువ నిపుణులు రాష్ట్రం వదిలి ఎందుకు పోతున్నారు? పరిశ్రమలు, పెట్టుబడులు ఏపీకి ఎందుకు రాలేదు? హైదరాబాద్, మద్రాస్, బెంగుళూరుల్లోని ఐటీ ఉద్యోగాల్లో ఆంధ్ర యువతే ఎక్కువ. ఏపీలో వారికి ఎందుకు అవకాశాలు కల్పించటం లేదు? ఏపీ యువత ఏన్డీఏ కూటమి వైపు ఎందుకు చూస్తోంది? ఏం ఆశిస్తోంది? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండయ్య పాల్గొన్నారు.
YOUTH FIRE ON YSRCP :ఉద్యోగం కోసం నువ్వెళ్లేది ఎక్కడికి? తెలంగాణా? కర్ణాటకా? తమిళనాడా? ఇది ఏపీలోని విద్యా సంస్థల్లో బీటెక్, డిగ్రీ చివరి ఏడాది చదివే విద్యార్థుల్లో ఏ ఇద్దరు కలిసినా ఎదురవుతున్న ప్రశ్న. సీఎం జగన్ హయాంలో ఏపీ దుస్థితికిది నిలువుటద్దం. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయి. ఈ సర్కార్‌ది రివర్స్ పాలన కదా ! అందుకే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది.
వైఎస్సార్సీపీ పాలనలో యువత భవిష్యత్తుకు నో గ్యారెంటీ - ఇతర రాష్ట్రాలకు వలసలు - YSRCP Government Cheated Youth
శిక్షణ కేంద్రాలను మూలనపడేసి యువతకు నైపుణ్యాలు అందకుండా చూసింది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న వాటినీ తరిమేసింది. యువతరం ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితిని కల్పించింది. ఒకవేళ ఇక్కడే ఉండాలనుకుంటే మాల్స్‌లో, చిన్నచిన్న పరిశ్రమల్లో పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని అంచనా.
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇతర యువతకు ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. గత ఐదేళ్లలో విశాఖపట్నంలో సుమారు 100 అంకుర సంస్థలు మూతపడ్డాయి. ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థలు వెళ్లిపోయాయి.
టీడీపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు విధానాన్ని పాటించింది. దరఖాస్తు చేసుకున్న కంపెనీకి సగం అద్దెకే ఆఫీసు స్పేస్ ఇచ్చేవారు. ఇంటర్నెట్, విద్యుత్తు సదుపాయం కల్పించేవారు. అయా సంస్థలు కల్పించే ఉద్యోగాలను బట్టి వాటికి నగదు ప్రోత్సాహకాలు అందించేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక వీటిని నిలిపివేశారు. ప్రోత్సాహకాలు లేక కొన్ని చిన్న సంస్థలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా మరికొన్ని మూతపడ్డాయి. రాష్ట్రంలో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేకపోవడంతో నియామకాలు చేపట్టే పరిస్థితి లేదు. ప్రతిభ ఉన్న యువతకు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వచ్చినా ఇవి కూడా చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లోనే ఉంటున్నాయి.
పార్ట్‌టైం జాబ్‌లు ఫుల్ టైం అయ్యాయి! అయినా గిగ్ వర్కర్ల గోడును పట్టించుకోని జగన్ సర్కార్ - GIG Workers Problems in Andhra
నిరుద్యోగంలో నంబర్ వన్ :గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగ రేటుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక బహిర్గతం చేసింది. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన సర్వే ప్రాతిపదికన దీన్ని రూపొందించారు. దీని ప్రకారం ఏపీలో జాతీయ సగటు కంటే పట్టభద్రుల్లో నిరుద్యోగిత అధికంగా ఉంది. చివరికి బిహార్ కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది. అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేటు ఏపీలో 24 శాతం ఉంటే జాతీయ సరాసరి 13.4 శాతంగా ఉంది. పక్కనున్న తెలంగాణ 9, తమిళనాడు 10వ స్థానంలో నిలిచాయి. అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళలో 34.6 శాతం నిరుద్యోగిత ఉండగా పురుషుల్లో 20.3 శాతంగా ఉంది. అదే ఇంటర్మీడియట్ కంటేలోపు చదువుకున్న వారిలో నిరుద్యోగిత తక్కువగా ఉంది. షాపింగ్‌మాల్స్, వాచ్‌మెన్‌లాంటి ఉద్యోగాలే రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం.
జాబు కావాలంటే బాబు రావాలి - యువత బాగా ఆలోచించి తొలి ఓటు వేయాలి: నీలాయపాలెం - TDP Nilayapalem Press Meet