Prathidwani :తనువు, మనస్సు మనల్ని నడిపించే జోడెడ్లు ఈ రెండూ! కానీ రెండింటికీ మనం అదే ప్రాధాన్యం ఇస్తున్నామా అంటే సమాధానం లేదు. అదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. అదుపు తప్పుతున్న ఆలోచనలు, ఉద్వేగాలు చిత్రవధ చేస్తున్నాయి. మొదట్లో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితాల్నే బలిపీఠంపైకి నెడుతున్నాయి. ప్రతి 100లో 30 మంది, ప్రతి 10మందిలో ముగ్గురు ఏదొక రకంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్‌తో సతమతం అవుతున్నారంటున్నాయి. స్టడీస్, ఉద్యోగాలు, వ్యాపారాల వెంట పరుగులు తీసేవారి జీవితాలు మరింత దయనీయం. కానీ ఎందుకీ దుస్థితి? శారీరక ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ మానసిక ఆరోగ్యంపై ఎందుకు ఉండడం లేదు? ఇకనైనా దిద్దుకోవాల్సిన, సర్దుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో సైక్రియాట్రిస్ట్‌ల సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు డా. ఎన్ఎన్ రాజు, మానసిక వైద్య నిపుణులుడా. ఇండ్ల విశాల్ పాల్గొన్నారు.
ఒత్తిడితో చిత్తవుతున్నారా - అయితే ఇలా చెక్ పెట్టేయ్ డ్యూడ్
నేటి కాలంలో మానసిక అనారోగ్యం అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు మానసిక ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు పనిలో ఒత్తిడితో పెద్దలు సైతం మానసిక అనారోగ్యానికి లోనవుతున్నారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.