Horses dont sleep by lying down :హార్స్ పవర్ (HP)అనేది శక్తి పర్యాయపదం. ఇంజిన్ శక్తిని హార్స్ పవర్‌గా కొలుస్తారు. ఒక హార్స్ పవర్ అంటే 746 వాట్స్కు సమానం. హార్స్ పవర్ అనే పదం స్కాటిష్ ఇంజినీర్ జేమ్స్ వాట్ కనుగొన్నారు. ఆవిరి ఇంజిన్ల (స్టీమ్)ను అభివృద్ధి చేసిన ఇతడు వాటి శక్తిని గుర్రాల శక్తితో పోల్చడానికి ఈ పదాన్ని ఉపయోగించాడు. ఇంజిన్ పనితీరు, పవర్ హార్స్ పవర్ పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ హార్స్ పవర్ కలిగిన ఇంజిన్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
'పద్మ' అవార్డు గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనాలు? - ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందా?
గుర్రాలు ఎందుకు కూర్చొని నిద్రించవంటే!
మూగజీవాలైన మేకలు, గొర్రెలు, బర్రెలతో పాటు ఇతర జంతువులు కాళ్లు ముడుచుకుని పడుకోవడం సహజమే. ఏనుగులు, ఒంటెలు సైతం నేలపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటాయి. కానీ, గుర్రాలు, జిరాఫీలు మాత్రమే నిలబడి విశ్రాంతి తీసుకుంటాయి. జిరాఫీలు పడుకున్నప్పుడు అవి చాలా తేలికగా నిద్రపోతాయి కాబట్టి ఇతర జంతువుల దాడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే అవి నిలబడి సురక్షితంగా నిద్రపోతుంటాయి. కానీ, పడుకున్న గుర్రాలను ఎప్పుడూ చూసి ఉండరు. వేగంగా పరిగెత్తే గుర్రాలు ఇతర జంతువుల మాదిరిగా నేలపై కూర్చోవడం చాలా అరుదు.
మూడు కాళ్లపై విశ్రాంతి :
గుర్రాలు ఎంత వేగంతో పరిగెత్తినా అలసిపోకపోవడానికి వాటి కండరాలే కారణం. వాటి కాలి కండరాలు చాలా ధృడంగా ఉంటాయి. నిలబడిన గుర్రాన్ని మీరు ఎపుడైనా గమనిస్తే అది మూడు కాళ్లనే ఉపయోగిస్తుంది. మరో కాలికి విశ్రాంతినిస్తుంది. ఇలా ఒకదాని తర్వాత మరో కాలికి విశ్రాంతినిస్తుంది. అంతే తప్ప కాళ్లకు విశ్రాంతి నిచ్చేలా ఇతర జంతువుల్లా పడుకోవడం అత్యంత అరుదు. గుర్రం అనారోగ్యం బారిన పడినపుడు మాత్రమే పడుకుంటుందట.
- గుర్రాలే కాదు జిరాఫీలు కూడా నిలబడి విశ్రాంతి తీసుకుంటాయి. ఎంతో పొడవైన మెడ, ఎత్తైన కాళ్లున్న జిరాఫీలు పడుకుంటే లేవడం కష్టం. అటవీ జంతువుల దాడి నుంచి తమను తాము సురక్షితంగా కాపాడుకోవడానికి అవి నిలబడే విశ్రాంతి తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నాయి.
- ఇక నీటిలో ఉండే అతి తెలివైన డాల్ఫిన్లు కూడా నిరంతరం కదులుతూ ఉండాల్సిందే. అవి నిద్రపోతున్నప్పుడు మెదడులోని ఒక భాగం మాత్రమే పనిచేస్తుందట. తద్వారా అవి కదలికలతో పాటు, శ్వాసను తీసుకుంటాయట. షార్క్ చేపలదీ ఇదే పరిస్థితి.
- చాలా పక్షులు సైతం చెట్ల కొమ్మలపై నిలబడి నిద్రిస్తుంటాయి. కొన్ని మాత్రమే గూళ్లు కట్టుకొని నిద్రిస్తుంటాయి. చెట్లపై నిద్రించే పక్షులు ఇతర పక్షులు, జంతువుల దాడుల నుంచి వేగంగా తప్పించుకోవడానికే కాళ్లపై నిలబడి నిద్రిస్తాయట.
ఫోన్ రకం, బ్యాటరీ ఆధారంగా చార్జీలు!? - డాటా భద్రతపై నెటిజన్ల ఆందోళన
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!