Tips for Induction Stove : ప్రస్తుతం వంటింట్లో ఉపయోగించే చాలా రకాల వస్తువులు కరెంట్‌తోనే పని చేస్తున్నాయి. ముఖ్యంగా అన్నం వండుకోవడానికి రైస్ కుక్కర్, వేడి నీళ్ల కోసం ఎలక్ట్రిక్ కెటిల్, వంటలు చేయడం కోసం ఇండక్షన్ స్టవ్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. LPG గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో ఎక్కువ మంది ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారు. అలాగే ఇండక్షన్ స్టవ్ మీద వంటలు కూడా త్వరగా పూర్తవుతాయి. దీనివల్ల మహిళలకు వంటింట్లో చాలా సమయం కలిసి వస్తుంది. ఇలా ఇండక్షన్ స్టవ్‌తో బోలేడు లాభాలున్నాయి. అయితే, మామూలు స్టవ్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది. ఈ క్రమంలో ఇండక్షన్ స్టవ్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇనుప టేబుల్ పైన పెట్టకండి
ఇండక్షన్ స్టవ్ కరెంట్‌తో పని చేస్తుంది. కాబట్టి దీనిని ఇనుప టేబుల్ మీద పెట్టి వంట చేయకూడదు. ఎందుకంటే కొన్ని సార్లు అనుకోకుండా షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇండక్షన్ స్టవ్‌ని వీలైనంత వరకు చెక్క టేబుల్‌పై పెట్టి ఉపయోగించడం మంచిది. అలాగే సెరామిక్ టైల్స్, సిమెంట్ ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చు.
గ్యాస్ స్టవ్ పక్కన వద్దు
కొందరు తెలిసో తెలియకో ఇండక్షన్ స్టవ్‌ని గ్యాస్ స్టవ్ పక్కన పెడుతుంటారు. అయితే ఇలా గ్యాస్ స్టవ్ పక్కన ఇండక్షన్ స్టవ్‌ని పెట్టకూడదు. ఎందుకంటే అనుకోకుండా ఎప్పుడైనా గ్యాస్ లీకైతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి, కిచెన్‌లోనే వేరేచోట ఇండక్షన్ స్టవ్‌ని పెట్టి వంట చేసుకోవాలి.
ఎలా క్లీన్ చేస్తున్నారు?