తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్ "స్పైసీ ఉల్లి మిక్చర్" - ఇంట్లోనే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయండి!

- వెంటనే సిద్ధమైపోయే ఈవెనింగ్​ స్నాక్ - పిల్లలు ఇష్టంగా లాగిస్తారు

Street Style Onion Mixture Masala
Street Style Onion Mixture Masala (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

Street Style Onion Mixture Masala :రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే చిరుతిళ్లలో స్పైసీ ఉల్లి మిక్చర్​ కూడా ఒకటి. ఈవెనింగ్​ టైమ్​లో పుల్లపుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు.. చాలా మందికి ఇదే గుర్తుకు వస్తుంటుంది. స్పైసీగా, కారంగా ఉండే ఉల్లి మిక్చర్​ నోటికి ఎంతో టేస్టీగా ఉంటుంది.​ అయితే.. రోడ్​ సైడ్​ బండిమీద తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది భయపడతారు. అలాంటి వారు కొన్ని టిప్స్​ పాటిస్తూ చేస్తే.. ఇంట్లోనే 5 నిమిషాల్లో స్పైసీ ఉల్లి మిక్చర్రెడీ అయిపోతుంది. ఈ స్నాక్​ రెసిపీ పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి, ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా ఇంట్లోనే ఉల్లి మిక్చర్​ ఎలా చేయాలి ? దాని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ? అనేవి ఇప్పుడు చూద్దాం.

టేస్టీ ఉల్లి మిక్చర్​కి కావాల్సిన పదార్థాలు :

  • అటుకులు-కప్పు
  • నూనె- సరిపడా
  • ఉప్పు-రుచికి సరిపడా
  • కారం- అర టీస్పూన్
  • ఉల్లిపాయ-1
  • కొత్తిమీర తరుగు కొద్దిగా
  • నెయ్యి-అర స్పూన్​
  • పల్లీలు-పావుకప్పు
  • పసుపు-చిటికెడు
  • ధనియాలపొడి -అర స్పూన్
  • చాట్​ మసాలా- పావు టీస్పూన్
  • నిమ్మకాయ-1

ఉల్లి మిక్చర్​ తయారీ విధానం..

  • ముందుగా ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి.
  • తర్వాత అటుకులు వేయించడం కోసం స్టౌ పై పాన్​ పెట్టండి.
  • నూనె బాగా వేడయ్యాక.. అటుకులు వేసి వేయించుకోవాలి.
  • (అటుకులు పల్చగా ఉండేవి కాకుండా కాస్త మందంగా ఉండేవి తీసుకోవాలి. అలాగే.. ఆయిల్​ కాగకముందే అటుకులు వేసుకోవద్దు. అలా వేస్తే అటుకులు ఆయిల్​ ఎక్కువ పీల్చుకోవడమే కాకుండా సరిగ్గా పొంగవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.)
  • తర్వాత అటుకులు వేసి వేయించి ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి.
  • అదే ఆయిల్లో పల్లీలు వేయండి. వీటిని కూడా మాడిపోకుండా వేయించి మిక్సింగ్​ బౌల్లో కలుపుకోండి.
  • తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి, కొత్తిమీర తురుము, నెయ్యి వేసి కలపండి. ఆపై కొద్దిగా నిమ్మరసం పిండి చేతితో మిక్స్ చేయండి.
  • అంతా బాగా కలుపుకున్నాక టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం, పులుపు వంటివి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే పుల్లపుల్లగా కారంగా ఎంతో రుచికరంగా ఉండే ఉల్లి మిక్చర్​ సిద్ధమైపోతుంది.
  • ఈ ఉల్లి మిక్చర్​ మీకు నచ్చితే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details