RAYALASEEMA STYLE MUTTON FRY :వీకెండ్ వచ్చిందంటే చాలు! ఎక్కడికి వెళ్లాలి? ఏ ఫుడ్ ఆస్వాదించాలనే చూస్తుంటారు నగర వాసులు. సెలవురోజుల్లో ప్రత్యేకించి ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ లాంటి వంటకాలపై ఓ కన్నేసి ఉంచుతారు మాంసాహారప్రియులు. అందుకే అలాంటి వారి కోసం జిహ్వ చాపల్యం తీరేలా రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై వంటకాన్ని సిద్ధంగా చేశాం. తయారీ ఎలాగో చూసేద్దామా?!
నానబెట్టడాలు, మిక్సీ పట్టడాల్లేవ్! - 10 నిమిషాల్లో కరకరలాడే రవ్వ పునుగులు
మటన్ కర్రీ కంటే మటన్ వేపుడు చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ, ఆంధ్రా స్టైల్లో మటన్ పులుసు, ఇక రాయలసీమలో చేసే మటన్ వేపుడు అదిరిపోతుంది. మటన్ వేపుడు కొత్తేమీ కాకున్నా రాయలసీమలోని కర్నాలు, చిత్తూరులో చేసే మటన్ ఫ్రై ఘాటు ఎక్కువ. స్పైసీ రుచులు ఇష్టపడే వారికి ఇది చాలా అద్భుతహ అనిపిస్తుంది. ఈ మటన్ వేపుడు 3రోజుల పాటు నిల్వ కూడా పెట్టుకోవచ్చు. పప్పుచారుతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
మటన్ ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు :
- మటన్ - అరకిలో
- అల్లం వెల్లులి పేస్టు - 1 టేబుల్ స్పూన్
- ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - తగినంత
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- పసుపు - 1 టేబుల్ స్పూన్
ఫ్రై బాగా రావడానికి ఈ టిప్స్ పాటించండి
- ఫ్రై కోసం ఎముకలున్న మాంసం కాకుండా కండ తీసుకోవడం బెటర్.
- మటన్ మసాలాలతో ఎంత ఎక్కువ సేపు నానితే అంత రుచిగా వస్తుంది.
- మంట లో ఫ్లేమ్‌లో పెట్టి నీరు ఇంకేదాగా వేపితే నిల్వ ఉంటుంది.
- ఫ్రై కదా అని మటన్ మరీ ఎక్కువగా వేయించితే తేమ తగ్గిపోయి ముక్కలు గట్టిగా మారిపోతాయి.