Parental Favoritism Youngest Child :"అమ్మా - నీకు నాకంటే చిన్నోడంటేనే ఎక్కువ ఇష్టం! వాడు ఏం చేసినా తిట్టకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుంటావు. అన్నం తినకపోతే గోరుముద్దలు తినిపిస్తావు! నాన్న - 'నీకు నాకంటే చిన్న చెల్లెలు మీదే ఎక్కువ ప్రేమ! అది ఎంత అల్లరి చేసినా నా బంగారు తల్లీ అంటూ అప్యాయంగా దగ్గరికి తీసుకుంటావు! నన్ను మాత్రం ఎప్పుడూ అంత ప్రేమగాచూడవు! ఇలాంటి ప్రశ్నలను ఏదోక సందర్భాల్లో మనలో చాలా మంది తల్లిదండ్రులను అడిగే ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు అలాంటిదేమీ లేదు. మీరందరూ నాకు సమానమే అని చెబుతుంటారు.
కానీ, తల్లిదండ్రులు తమ సంతానంలో అందరినీ సమానంగా చూడరట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లలందరికన్నా ముఖ్యంగా చివరి సంతానాన్నే ఎక్కువ గారాబం చేస్తారని పేర్కొంది. ఇలా పేరెంట్స్ మొదటి సంతానంగా జన్మించిన వారికంటే, చివరి వారినే ఇష్టపడడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువ స్వేచ్ఛనిస్తారు :
చాలా మంది తల్లిదండ్రులుమొదటి సంతానానికి ఎదిగే క్రమంలో కాస్త ఎక్కువ స్వేచ్ఛనిస్తారు. వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారని, సమాజంలో బాధ్యత వ్యవహరిస్తారని, నిర్ణయాలు తీసుకునే సామార్థ్యం ఉంటుందని పేరెంట్స్ భావిస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎక్కువ గారాబం చేయడంలో తమ చివరి సంతానంవైపే కాస్త మొగ్గు చూపుతారని అధ్యయనం వెల్లడించింది. జెండర్, పుట్టిన క్రమం ఆధారంగా పిల్లల పెంపకంపై పేరెంట్స్ పోకడను పరిశీలించడానికి ఈ పరిశోధన చేశారు. ఇందుకు 19,500 మందితో సర్వే చేసి తయారు చేసిన 30 నివేదికలు, 14 డేటాబేస్‌లను పరిశీలించారు. ఈ రీసెర్చ్ వివరాలు సైకలాజికల్ బులెటిన్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
డబ్బు ఎక్కువ ఖర్చుపెడతారు!
ఒక సంతానం కంటే మరొకరిపై ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం, వారితో కాస్త ఎక్కువ టైమ్ గడపడం వంటి విధానాల ద్వారా పేరెంట్స్ వివక్షతో కూడిన అభిమానం చూపిస్తారని పరిశోధకులు స్పష్టం చేశారు. చివరిగా పుట్టినవారికి ఇలాంటి ప్రేమ ఎక్కువ దక్కుతోందని నివేదికలో పేర్కొన్నారు. నార్మల్గా తక్కువ అభిమానం చూరగొంటున్న పిల్లలపై దీర్ఘకాలంలో ఈ ధోరణి కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.