Telangana Tourism Nagarjuna Sagar Tour : ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా డ్యామ్‌లు, కాలువలు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది వాటర్ ఫాల్స్, డ్యామ్‌లు చూడాలని అనుకుంటుంటారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఎక్కువ మంది వీటిని సందర్శించడానికి వెళ్తుంటారు. మరి మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారా? అయితే మీకు తెలంగాణ టూరిజం గుడ్‌న్యూస్ చెబుతోంది. నాగార్జున సాగర్ చూసేందుకు ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు చూడొచ్చు? ప్రయాణం ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
టూర్ ప్యాకేజీ ఇదే:హైదరాబాద్ - నాగార్జునసాగర్ - హైదరాబాద్ పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. కేవలం ఒక్క రోజులోనే టూర్ ముగిసేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. ప్రతీ శని, ఆదివారం రోజుల్లో ఈ టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - IRCTC Ganga Sarayu Darshan Package
ప్రయాణం ఎలా ఉంటుందంటే:
- ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
- ఉదయం 8 గంటలకు బషీర్‌బాగ్ చేరుకుని అక్కడి నుంచి సాగర్‌కు బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది.
- ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.
- ఉదయం 11:40 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు.
- ఇక ఆ తర్వాత ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
- ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. బోటింగ్ కూడా చేయొచ్చు.
- సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్‌ను విజిట్ చేస్తారు.
- 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో సాగర్ టూర్ పూర్తవుతుంది.
ప్యాకేజీ వివరాలు..
- పెద్దలకు రూ. 800, చిన్నారులకు రూ. 640గా టికెట్ ధరలు నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది.
- బోటింగ్, ఎంట్రీ, భోజనం వంటివి టూర్ ప్యాకేజీలో కవర్ కావు. ప్రయాణికులే వీటిని భరించాలి.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
తెలంగాణ టూరిజం వన్డే ప్యాకేజీ - కేవలం రూ.1500 టికెట్‌తో జోగులాంబ, అంజన్న దర్శనం, ఇంకా మరెన్నో! - Telangana Tourism Packages