ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

కాకర కాయ ఫ్రై ఇక ఎన్నటికీ చేదుగా ఉండదు! - ఈ పద్ధతిలో చేయండి - BITTER GOURD FRY

- కాకర చేదు పోగొట్టడానికి సూపర్ టిప్స్ - ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలకూ చాలా ఇష్టం!

how to remove bitterness from bitter gourd recipe
how to remove bitterness from bitter gourd recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Bitter Gourd Fry in Telugu :కాకరకాయ హెల్త్​కు చాలా మంచిది. కానీ.. చేదు అనే కారణంతో చాలా మంది దీన్ని అంతగా తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు కాకరకాయ కర్రీ అనగానే మొహం చిట్లిస్తారు. మీ పిల్లలు ఆ జాబితాలో ఉన్నారా? అయితే, ఓసారి ఇలా "కాకరకాయ ఫ్రై" చేసి పెట్టండి. అస్సలు చేదు ఉండదు! పైగా టేస్ట్ అద్దిరిపోతుంది. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు. దీన్ని కొత్తగా వంట చేసే వారు, బ్యాచిలర్స్​తో పాటు ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • కాకరకాయలు - అరకిలో
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • ఉల్లిపాయ - 1(సన్నగా తరుక్కోవాలి)
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - కొద్దిగా

వెల్లుల్లి కారం కోసం :

వెల్లుల్లి రెబ్బలు - 6

  • జీలకర్ర - అరటీస్పూన్
  • కారం - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - కొద్దిగా

తయారీ విధానం :

  • మొదట కాకరకాయల చెక్కును తొలగించుకోవాలి. తర్వాత.. చెక్కు తీసిన కాకరకాయలను మధ్యలోకి కట్ చేసి ఆపై వాటిని నిలువుగా చీల్చి, లోపలి గింజల భాగాన్ని తొలగించాలి.
  • తర్వాత వాటిని క్యూబ్స్ లాగా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల కాకర ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి. కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
  • ఆ విధంగా కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్​లోకి తీసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కోట్ చేసి అరగంట పాటు అలా వదిలేయాలి.
  • అనంతరం ఉప్పులో ఊరబెట్టిన ముక్కల్ని చేతితో గట్టిగా పసరు పిండి మరో గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ తో చేదు చాలా వరకు తగ్గిపోతుంది.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి, తాలింపు చక్కగా వేయించుకోవాలి.
  • తాలింపులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి కలిపి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక అందులో ముందుగా పసరు పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పాన్​ మీద మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అందుకోసం 15 నిమిషాల దాకా సమయం పట్టొచ్చు.
  • ఈలోపు వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • కాకర ముక్కలు మంచిగా వేగాయనుకున్న తర్వాత.. ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని కలిపి మూతపెట్టకుండా మరో 10 - 15 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. మరీ నల్లగా వేయించుకోవద్దు.
  • చివరగా.. మీకు నచ్చితే ఒక చెంచా చక్కెర వేసుకొని కలిపి దింపేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన "కాకరకాయ ఫ్రై" రెడీ!

ఇవీ చదవండి :

నోటికి చేదు.. నెత్తికి అమృతం! - కాకరకాయ రసంతో హెయిర్​ ఫాల్​, తెల్ల జుట్టుకు చెక్

చేదుగా ఉందని దూరం పెడితే ఎలా?- ఆ కూరగాయ ఖనిజాల గని

ABOUT THE AUTHOR

...view details