తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఉల్లిపాయతో కమ్మటి "రోటి పచ్చడి" - ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​! - ONION CHUTNEY RECIPE IN TELUGU

- వేడివేడి అన్నంలోకి అద్భుతమైన ఆప్షన్

How to Make Ullipaya Roti Pachadi
How to Make Ullipaya Roti Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 5:11 PM IST

How to Make Ullipaya Roti Pachadi :మనలో చాలా మందికి రోటి పచ్చళ్లంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఏ కూరగాయలూ లేనప్పుడు.. ఏదైనా కమ్మటి రోటి పచ్చడి ఉంటే చాలు ఆ పూట తృప్తిగా భోజనం చేయొచ్చు. అయితే.. దాదాపు అందరికి రోటి పచ్చడిఅనగానే టమాటా, దోసకాయ, దొండకాయ పచ్చళ్లే ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి. కానీ, వీటితోనే కాకుండా ఉల్లిపాయలతో కూడా టేస్టీగా పచ్చడి ప్రిపేర్​ చేయవచ్చు.

ఈ స్టోరీలో చెప్పిన విధంగా 'ఉల్లిపాయ రోటి పచ్చడి' చేస్తే చట్నీ పుల్లపుల్లగా, కారంగా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా పచ్చడి చేస్తే తాలింపు కూడా అవసరం లేదు. వేడివేడి అన్నంతో ఈ పచ్చడిచాలా కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయ రోటి పచ్చడి గాజు సీసాలో స్టోర్​ చేసి ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సులభంగా కమ్మగా ఉల్లిపాయ రోటి పచ్చడి ఎలా చేయాలి ? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు :

  • 8 -10 ఎండు మిర్చి
  • పెద్ద ఉల్లిపాయ
  • ఆయిల్​ -2 టేబుల్​స్పూన్లు
  • ఉసిరికాయంత చింతపండు
  • ఉప్పు రుచికి సరిపడా
  • అర స్పూన్ ఆవాలు
  • అర స్పూన్ జీలకర్ర
  • పావు స్పూన్​ మెంతులు
  • ధనియాలు-టేబుల్​స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు-5
  • కరివేపాకు-2

ఉల్లిపాయ రోటి పచ్చడి తయారీ విధానం..

  • ముందుగా ఒక గిన్నెలో చింతపండు కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌపై పాన్​ పెట్టి ఆయిల్​ వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేపండి.
  • 2 నిమిషాలు మిర్చి వేగిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి.
  • ఈ మిశ్రమం కాస్త చల్లారనివ్వాలి. ఆపై రోటిలో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా రుబ్బుకోవాలి.
  • తర్వాత అందులోనే కరివేపాకులు, నానబెట్టుకున్న చింతపండు వేసుకుని మరోసారి దంచుకోవాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. (మీరు మిక్సీలో గ్రైండ్​ చేసుకోవాలనుకుంటే.. అన్నింటినీ కాస్త బరకగా గ్రైండ్​ చేసుకుంటే సరిపోతుంది.)
  • అంతేనండీ.. ఎంతో రుచికరంగా ఉండే ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ.
  • ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి పుల్లపుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది.
  • ఈ పచ్చడి నచ్చితే మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

ఇవి కూడా చదవండి :

టమాటాలు ఉడకబెట్టకుండా నిమిషాల్లో అద్దిరిపోయే పచ్చడి - అన్నం, టిఫెన్స్​లోకి సూపర్ కాంబో!

వారెవ్వా అనిపించే "చెట్టినాడు ఆలూ ఫ్రై" - మసాలా నషాళానికి అంటాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details