ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ఉడకబెట్టే పనిలేకుండా కమ్మటి "టమాట పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే! - TOMATO PACHADI IN TELUGU

ఎప్పుడూ టమాటా పచ్చడి ఒకేలా చేస్తున్నారా?- ఓసారి ఇలా కొత్తగా ట్రై చేయండి!

Easy Tomato Pachadi Recipe
Easy Tomato Pachadi Recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2025, 12:09 PM IST

Easy Tomato Pachadi Recipe : ఇంట్లో ఏ కూర వండినా మనలో చాలామందికి రెండు ముద్దలు అన్నం- పచ్చడితో తింటేనే తృప్తిగా అనిపిస్తుంది. అందుకే ఆవకాయ, ఉసిరి వంటి నిల్వ పచ్చళ్లు ఉన్నా అప్పుడప్పుడూ టమాటా, గోంగూర, దోసకాయ వంటివి పెడుతుంటాం. అయితే, టమాటా చట్నీ ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఇలా 'టమాటాలు ఉడకబెట్టకుండా పచ్చడిని' ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ సూపర్​గా ఉంటుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ టమాటా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - అర కేజీ
  • కారం - తగినంత
  • చింతపండు - నిమ్మకాయంత
  • రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 10 నుంచి 12
  • వేయించిన ఆవాల పొడి - పావు టీస్పూన్
  • వేయించిన మెంతుల పొడి - పావు టీస్పూన్

తాలింపు కోసం :

  • నూనె - ముప్పావు కప్పు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప పప్పు - 1 టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • ఎండుమిర్చి - 6
  • పసుపు - అరటీస్పూన్
  • ఇంగువ - పావు టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా టమాటాలను తొడిమె భాగం కట్​ చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే కారం, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్​ కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి కాసేపు వేపుకోవాలి.
  • ఆపై అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి పోపును చక్కగా ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు దోరగా వేగాక ఆ మిశ్రమంలో ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్య మధ్యలో పచ్చడిని గరిటెతో కలుపుతూ నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు అందులో వేయించిన మెంతుల పొడి, ఆవాల పొడి వేసి కలుపుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది.
  • అలాగే టమాటా పచ్చడిని ఉడికించుకునే క్రమంలో ఉప్పుని సరి చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి.
  • చట్నీలో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దింపి చల్లారనివ్వాలి.
  • పూర్తిగా చల్లారిన పచ్చడిని ఏదైనా గాలి చొరబడని గాజు కంటైనర్ లేదా జార్​లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే ఎంతో సూపర్​ టేస్టీ "టమాటా పచ్చడి" రెడీ!
  • ఈ పచ్చడిని మామూలుగా నిల్వ చేసుకుంటే కనీసం వారం పాటు నిల్వ ఉంటుందట. అదే ఫ్రిజ్​లో పెట్టుకుంటే దాదాపు 20 రోజుల వరకు ఫ్రెష్​గా నిల్వ ఉంటుంది!

మైదా అవసరం లేకుండా రుచికరమైన 'రవ్వ పరోటాలు' - తయారీ చాలా సింపుల్!

సూపర్​ టేస్టీ "ఉలవచారు చికెన్​ లాలీపాప్స్​" - ఈ పద్ధతిలో చేస్తే ఒక్కటీ మిగలదు!

ABOUT THE AUTHOR

...view details