How to Make Soft Chapati :ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గేందుకు.. చపాతీని చాలా మంది బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. అయితే.. చపాతీలు మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. కానీ చాలా మందికి వాటిని మెత్తగా చేయడం రాదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. గట్టిగానే వస్తుంటాయి. మీరు కూడా ఇలా అలసిపోయారా? అయితే.. ఈ టిప్స్ పాటిస్తే.. చపాతీలు పొంగడంతోపాటు గంటలపాటు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయని అంటున్నారు కుకింగ్ ఎక్స్ పర్ట్స్. మరి ఆ టిప్స్ పాటిస్తూ చపాతీలు ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - సరిపడా
నూనె - సరిపడా
తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కేవలం చేతివేళ్లతో మాత్రమే కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తానికి నీళ్లు కలిపి.. ఆ తర్వాత అరచేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సుమారు 7 నుంచి 10 నిమిషాల పాటు పిండి ముద్దను సాగదీస్తూ కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్‌గా వస్తుంది.
- ఆ తర్వాత ఆ పిండిలోకి 2 టీ స్పూన్లు నూనె వేసి మరో 4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిపై మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
- అనంతరం పిండిని మరో రెండు నిమిషాలు నిధానంగా కలుపుకోవాలి. అనంతరం వాటిని సమాన ఉండలుగా చేసుకుని అవి ఆరిపోకుండా పైన మూత పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక ఉండను తీసుకుని పొడి గోధుమ పిండిలో ముంచి చపాతీ పీట మీద రౌండ్‌గా వచ్చేలా రుద్దుకోవాలి. ఆ తర్వాత ఆ చపాతీపై నూనె రాసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్లీ ఆ లేయర్‌పై నూనె రాసి మళ్లీ ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు అది ట్రైయాంగిల్ షేప్‌లో వస్తుంది.
- ఇప్పుడు ఆ చపాతీని మళ్లీ పొడి గోధుమ పిండిలో ముంచి రౌండ్‌గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేముందు పిండి మధ్యలో రుద్దకుండా పిండి చివర్లు రుద్దుతూ రౌండ్ షేప్ వచ్చేవరకు రోల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చపాతీ అనేది మందంగా లేదా పల్చగా కాకుండా మీడియం థింక్నెస్ వచ్చేలా తాల్చుకోవాలి.
- ఇలా చేసిన చపాతీని ఓ ప్లేట్లోకి తీసుకుని.. అది ఆరిపోకుండా ఏదైనా క్లాత్ కప్పాలి. ఇలా అన్ని ఉండలను చపాతీలుగా ఒత్తుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. పెనం హీటెక్కిన తర్వాత చపాతీ వేసి ఓ 10 సెకన్లు పాటు కాల్చుకోవాలి.
- ఆ తర్వాత రెండో వైపు తిప్పి మరో 10 సెకన్ల పాటు కాల్చుకోవాలి. ఈ సమయంలో చపాతీలు పొంగుతుంటాయి. అప్పుడు చపాతీ రెండు వైపులా నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి.
- ఇలా కాలిన చపాతీని హాట్ బాక్స్‌లో పెట్టి మూత పూర్తిగా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టాలి. ఇలా అన్నింటిని చేసుకుని తీసుకుంటే.. గంటలపాటు కూడా సూపర్సాఫ్ట్గా ఉండే చపాతీలు రెడీ. బరువు తగ్గేందుకు చపాతీ తినే వారు నూనె లేకుండా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకున్నా మెత్తగానే ఉంటాయి..
చపాతీలలో ఈ పిండి కలిపితే అద్భుతం జరుగుతుంది - మీ ఒంట్లో కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది!
జొన్న రొట్టెలు చేయడం రావట్లేదా? - ఈ సీక్రెట్ టిప్స్ పాటిస్తూ చేస్తే చపాతీ కంటే సూపర్ సాఫ్ట్!
చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్‌గా వస్తాయి!