E waste gold recovery chemicals :'పాత సెల్ఫోన్లు కొంటాం' అంటూ ఈ మధ్య ఇంటింటికీ వస్తుండడాన్ని గమనించారా? సెల్ఫోన్లలోని చిప్స్ తయారీలో బంగారం ఉపయోగిస్తారు. కొన్ని శాస్త్త్రీయ పద్ధతుల్లో బంగారాన్ని తిరిగి వేరుచేసే అవకాశం ఉండడమే అందుకు కారణం.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యుగం నడుస్తోంది. విద్యుత్ ఉపకరణాల వాడకం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ-వ్యర్థాలు కూడా అదే మోతాదులో పేరుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 62 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తుండగా ఇందులో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. రీసైక్లింగ్ ప్రాసెసింగ్ వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు అధికంగా ఖర్చవుతున్న నేపథ్యంలో అమెరికన్ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. తద్వారా వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రీసైక్లింగ్ చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీయడం దీని ప్రధాన ఉద్దేశం.
అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!
సాధారణంగా, బంగారం వెండి వంటి లోహాలు భూమి లోపలి పొరల్లో లభిస్తాయి. అయితే, ఎలక్ట్రానికి 'ఈ వేస్టేజీ' నుంచి బంగారం ఎలా తీస్తారని చాలా మందికి అనేక సందేహాలున్నాయి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ పరికరాల్లో చిప్స్, సర్క్యూట్లు కనెక్టర్లుగా బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇది తుప్పు పట్టకుండా ఉండడంతో పాటు అధిక విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది. దీనిని నికెల్, కోబాల్ట్ వంటి లోహాలతో కలిపి ఉపయోగిస్తే మరింత మన్నిక కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి 'ఈ వేస్టేజీ' పేరుకుపోతున్న తరుణంలో ప్రపంచంలోని బంగారంలో 7 శాతం వరకు ఈ-వ్యర్థాల్లో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందుకే వాటి నుంచి బంగారాన్ని వేరు చేసి తీయడానికి ప్రత్యేకంగా రెండు సాంకేతికత పద్ధతులను అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు.