తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్​: మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా ? అయితే మీకు ఈ ప్రాబ్లమ్​ ఉన్నట్టే! - Feel Tired After Eating Lunch - FEEL TIRED AFTER EATING LUNCH

Why We Get sleep After Lunch : చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు అలా పడుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర మత్తు ఆగదు. దీంతో ఒక గంట పడుకోవాల్సి వస్తుంది. అయితే, ఇలా తిన్న వెంటనే నిద్ర ముంచుకు వస్తుందంటే ఈ సమస్య ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.

sleep After Eating Lunch
Why We Get sleep After Eating Lunch (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 11:38 AM IST

Why Do Feel Tired After Lunch :మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మెజార్టీ జనాలకు ఏదో మత్తు ఆవహించినట్లుగా ఉంటుంది. కొద్దిసేపు అలా నిద్రపోవాలనిపిస్తుంది. నిద్ర పోకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మత్తు వదలదు. మరి, మీకు కూడా ఇలాగే ఉందా? అయితే మీరు "ఫుడ్​కోమా" లోకి వెళ్తున్నట్టే అని నిపుణులు అంటున్నారు. అసలు ఈ ఫుడ్​కోమా అంటే ఏమిటి? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫుడ్​ కోమా: సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్​ఫాస్ట్​, మధ్యాహ్న భోజనం, మళ్లీ రాత్రికి చపాతీ లేదా రైస్‌ లాంటివి తింటుంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. కాగా, ఇందులో ఉండే పదార్థాలే నిద్రను కలిగిస్తాయని.. ఈ పరిస్థితినే 'ఫుడ్‌కోమా' అంటారని నిపుణులు అంటున్నారు.

కారణాలు ఇవే: మనం భోజనం చేసిన తర్వాత శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో పడుతుంది. దీనివల్ల రక్తప్రవాహం జీర్ణవ్యవస్థవైపు మళ్లీ.. మెదడుకేమో రక్తప్రసరణ తగ్గుతుంది. అలాగే తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయులను మేనేజ్‌ చేయడానికి శరీరం ఇన్సులిన్‌ను విడుదలచేస్తుంది. ఈ ఇన్సులిన్‌ బ్రెయిన్‌లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది సెరటోనిన్, మెలటోనిన్‌ అనే హార్మోనులను ఎక్కువ మోతాదులో విడుదల చేసి, మనకు నిద్రపట్టేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇంకొంచెం తిందాం అనిపించినప్పుడే ఆపేయాలని సూచిస్తున్నారు.

ఇంట్రస్టింగ్ : ఈ చిన్న టిప్స్​ పాటిస్తే చాలు - జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది!

2018లో "ఫుడ్‌ రీసర్చ్‌" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా ఉండే ఆహారం తిన్న తర్వాత మానసిక పనితీరు తగ్గుతుందని, మగత పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌కు చెందిన 'డాక్టర్‌ డేవిడ్ జె. స్టెయెర్స్' పాల్గొన్నారు. కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉండే ఆహరం తీసుకుంటే మగతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తిన్న తర్వాతే ఎందుకు?

  • మనం తినే అన్నం, చపాతీలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా నిద్రమత్తు వచ్చేలా ప్రేరేపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలి. అలాగే సమతుల ఆహారం తినాలి. దీనివల్ల మెలకువగా, చురుకుగా ఉంటామని అంటున్నారు.
  • ఒకేసారి ఎక్కువగా తినకుండా.. కొంచెం కొంచెం ఆహారం తినాలి. దీనివల్ల శరీరంలో ఒక్కసారిగా ఇన్సులిన్‌ స్థాయులు పెరగకుండా ఉంటాయి.
  • ప్రొటీన్‌లు, ఆరోగ్యకరమైన కొవ్వులూ, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లూ లాంటి అన్ని పోషకాలూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలో గ్లూకోజు స్థాయులను స్థిరంగా ఉంచుతాయి.
  • ఎక్కువగా నీళ్లు తాగాలి.
  • తిన్న తర్వాత కొద్ది దూరం నడవాలి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆయిల్ బాటిల్స్​? లేక స్ప్రేనా? వంటింట్లో ఏది బెటర్​?

డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన బెస్ట్ సలాడ్స్ ఇవే - ప్రిపరేషన్ వెరీ ఈజీ - రుచి సూపర్​గా ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details