Mouth Breathing Side Effects: జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ కారణంగా నోరు తెరిచి నిద్ర పోవడం కామన్. అయితే జలుబు లేకపోయినా కూడా నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటే మాత్రం అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇలా దీర్ఘకాలికంగా నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉన్న వారిలో ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నోటి ద్వారా శ్వాస ఎందుకు: ముక్కులో నుంచి గాలి మృదువైన మార్గం ద్వారా ఊపిరితిత్తులను చేరుకోవాలి. అలా చేరుకోవడంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. అలాగే టాన్సిల్స్ పెద్దవిగా పెరిగినా, ఒత్తిడి అధికమైనా, మానసిక ఆందోళనలు ఎక్కువైనా, ముక్కులో పాలిప్స్ పెరిగినా లేదా కణితులు ఉన్నా, బరువు పెరిగినా కూడా ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకునే అలవాటు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
నోటి ద్వారా శ్వాస తీసుకుంటే కనిపించే లక్షణాలు:చాలా మందికి నోరు తెరిచి నిద్రపోతున్నామని కూడా తెలియదు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే మీరు నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారని అర్థమని అంటున్నారు నిపుణులు.
- నోరు పొడి బారడం
- శ్వాస వాసన చెడుగా రావడం
- స్వరం బొంగురు పోవడం
- అలసిపోయినట్టు అనిపించడం
- దీర్ఘకాలికంగా అలసట
- కళ్ల కింద డార్క్ సర్కిల్స్
జీడిపప్పు Vs బాదం - బరువు తగ్గడానికి ఇది బెటర్ ఆప్షన్! - Cashew Vs Almond Which Is Healthier
నోటి ద్వారా శ్వాస తీసుకుంటే వచ్చే సమస్యలు:
శ్వాసకోశ సమస్యలు: నోరు తెరిచి నిద్ర పోయేటప్పుడు నోరు, గొంతు పొడిబారుతుందని, దగ్గు రావడం, గురక వంటి సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు. కాలక్రమేణా, ఇది నిద్రాపక్షవాతం వంటి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 2016లో స్లీప్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నోటి ద్వారా శ్వాస తీసుకునే వ్యక్తులలో నిద్రాపక్షవాతం వచ్చే అవకాశం 2.5 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు.
దంత సమస్యలు:నోరు తెరిచి నిద్ర పోవడం వల్ల నోరు పొడిబారుతుందని.. దీని వల్ల దంత క్షయం, చిగుళ్ల వ్యాధి వంటి దంత సమస్యలు రావచ్చని అంటున్నారు.