Immunity Boosting Foods :వాతావరణ పరిస్థితులు మారుతున్న కొద్దీ మన శరీరానికి కావాల్సిన పోషక అవసరాలు మారతాయి. ఇదే సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ వివిధ కారణాల వల్ల బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాలానికి అనుగుణంగా సరైన పోషకాహారాన్ని శరీరానికి అందించడం చాలా కీలకం. అందులో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. కానీ, చాలా మందికి రోగనిరోధక శక్తి(Immunity Power) పెరగాలంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలియదు. అలాంటివారి కోసమే ఈ స్టోరీ. ఈ ఫుడ్స్‌ను రోజువారి డైట్లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ మస్త్‌గా పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
స్ప్రౌట్స్ : వీటిని పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా పెసర మొలకలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, విటమిన్ K వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యం, శక్తి ఉత్పత్తి, రక్తం గడ్డకట్టడం వంటి వివిధ శారీరక విధులకు చాలా ముఖ్యమైనవి. అదనంగా, మూంగ్ స్ప్రౌట్స్ రాగి, ఇనుము, జింక్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ మొలకలు మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
పండ్లు, కూరగాయలు : మీ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి మీ డైట్లో నారింజ, నిమ్మకాయ, ఉసిరికాయ, బెల్ పెప్పర్స్, ద్రాక్ష వంటి విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయలు తప్పక ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి డ్యామేజ్ కాకుండా రోగనిరోధక వ్యవస్థను రక్షిస్తాయి.
స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, బ్లడ్ షుగర్ నియంత్రణ! కరివేపాకుతో ప్రయోజనాలెన్నో