While Travelling Should Carry These Products : మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. అయితే బయటకు వెళ్లినప్పుడు అన్ని సందార్భాల్లోనూ ఇది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు(Journey) చేసేటప్పుడు, అత్యవసర సమయాల్లో మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అలాంటి సందర్భాల్లో మీ దగ్గర కొన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే టాయిలెట్ ఇన్ఫెక్షన్లు(Infections)కూడా రావని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, ప్రయాణాలు చేసేటప్పుడు మహిళల దగ్గర ఉండాల్సిన ఆ ప్రొడక్ట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంటిమేట్ పౌడర్లు :ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో విహారయాత్రలకు వెళ్లినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కూల్‌గా ఉంటే.. మరికొన్ని ప్రదేశాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో చెమట ఎక్కువగా వస్తుంది. ఫలితంగా ర్యాషెస్, అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వ్యక్తిగత భాగాలు పొడిగా ఉంచుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయని చెబుతున్నారు. కాబట్టి, ఇలాంటి సమస్యల బారినపడకుండా ఉండాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటిమేట్ పౌడర్స్‌ను వెంట తీసుకెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుందంటున్నారు.
ఇంటిమేట్ వైప్స్ : విహారయాత్రలు, బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. కొన్ని సందర్భాల్లో టాయిలెట్ల సౌకర్యం ఉండదు. మరికొన్ని సందర్భాల్లో శుభ్రమైన వాటర్ లభించదు. ఇలాంటి టైమ్‌లో జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడానికి 'ఇంటిమేట్ వైప్స్' అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మార్కెట్లో ఇలాంటివి పలు బ్రాండ్లలో దొరుకుతున్నాయి. అంతేకాదు.. ఈ వైప్స్‌లో రసాయనాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి, బయటకు వెళ్లేటప్పుడు వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిదంటున్నారు. అయితే, వీటిని యూజ్ చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
వెంటనే బాత్రూమ్కు పరిగెత్తాల్సివస్తోందా? - కారణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి!
టాయిలెట్ శానిటైజర్స్ : సాధారణంగా మనం విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఇతరులు వాడిన టాయిలెట్స్ ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి టైమ్‌లో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు టాయిలెట్ సీట్ స్ప్రే శానిటైజర్ వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు.