Health Benefits of Overripe Bananas : మనందరమూ మాగిన అరటి పండ్లు ఇంట్లో కనిపిస్తే తినకుండా చెత్తబుట్టలో వేస్తాం. కానీ ఇలా అతిగా పండిన అరటి పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. బాగా పండిన వాటిల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు విరివిగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇవి తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయని, అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ మానవ శరీరంలో కీలక భూమిక పోషిస్తుందని పరిశోధనల సారాంశం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా తీసుకోవటం వల్ల ప్రధానంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వాతావరణంలో కలిగే మార్పుల వల్ల సంక్రమించే వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.
షుగర్ పేషెంట్లు అరటిపండ్లు తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
రక్తపోటును నియంత్రిస్తుంది:మాగిన అరటి పండ్లు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఈ అరటిపండ్లలో లభిస్తాయి. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు వీటి ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే కణాలు దెబ్బతినకుండా రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మంటను తగ్గిస్తుంది: సాధారణంగా చాలా మందిలో అప్పుడప్పుడు గుండె మంటగా అనిపిస్తుంది. అరటిలో సాధారణంగా ఉండే యాంటాసిడ్ పదార్థం గుండె మంట సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మాగిన అరటిపండు నుంచి ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.