Vijay Sethupathi Kamal Hassan : సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన చిత్రం 'ఇండియన్-2'. విలక్షణ నటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో 1996లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే అంతటి భారీ తారాగణం, సెన్సేషనల్ డైరెక్టర్, యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ లతో కలిసి పనిచేయడానికి మరో అవకాశం వచ్చినా విజయ్ సేతుపతి నో చెప్పారట. ఎందుకో తెలుసా? ఈ విషయాన్ని ఆయనే గతంలో ఓ సందర్భంలో ఓ ఈవెంట్‌లో చెప్పారు.
Vijay Sethupathi Indian 2 Movie :సినీ ప్రస్థానంలో కమల్ హాసన్ 60ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగించుకున్న సందర్భంగా గతంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి హాజరైన విజయ్ 'భారతీయుడు-2' సినిమా గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. 'ఇండియన్-2'లో నటించేందుకు ఆ చిత్రబృందం తనను ఆశ్రయించారన్న విషయాన్ని పబ్లిక్‌గా బయటపెట్టారు సేతుపతి. చిత్రంలోని ఓ కీలకమైన పాత్రను ఆఫర్ చేశారని, కానీ కొన్ని సమస్యల కారణంగా తాను ఆ సినిమాలో పనిచేసేందుకు నో చెప్పానని తెలిపారు. కానీ ఇందుకు గల కారణాల గురించి మాత్రం అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు.
అదే కార్యక్రమంలో కమల్ హాసన్‌కు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు విజయ్. కమల్‌తో కలిసి తెర మీద కనిపించే అవకాశం మరోసారి తనకు ఇవ్వాలంటూ కోరారు. అంతేకాదు కమల్ హాసన్‌తో కలిసి పనిచేసిన నటులందరూ తమ అనుభవాలను అందరితో పంచుకోవాలంటూ అభ్యర్థించారు. ఇది ప్రస్తుత తరం నటులకు బాగా సహాయపడుతుందని విజయ్ అన్నారు.