Vijay Sethupathi Nithya Menon Movie : విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేచురాలిటికీ దగ్గరగా ఉండే పాత్రలను, సినిమాలను చేస్తూ ఎంతో మంది సినీ అభిమానుల ప్రేమను పొందారు. ముఖ్యంగా తన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు.
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు విజయ్ సేతుపతి. రీసెంట్గా ఆయన నటించిన మహారాజ చిత్రం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ విశేష ఆదరణను దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇంకా ఈ సినిమా గురించి సినీ ప్రియులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
Pandiraj Vijay Sethupathi Movie : అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతి మరో కొత్త సినిమా కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్లో జాయిన్ కూడా అయ్యారు. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ డైరెక్షన్లో ఇది తెరకెక్కుతోంది. సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా నిత్యా మేనన్ నటిస్తోంది. ఈ చిత్రంపై సినీ ప్రియుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారని మూవీటీమ్ చెబుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ పరోటా మాస్టర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నిత్యా మేనన్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ మూవీలో విజయ్ సేతుపతి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తాను జిరాక్స్ షాప్ నిర్వహించే ఒక సాధారణ మహిళ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపింది.