Vijaya Rangaraju Passed Away :తెలుగు సీనియర్ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపదడుతున్న రంగరాజు, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే సడెన్గా గుండెపోటుకు గురై రంగరాజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
ప్రముఖ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత- టాలీవుడ్ సంతాపం! - VIJAYA RANGARAJU PASSED AWAY
గుండెపోటుతో సీనియర్ నటుడు రంగరాజు మృతి
Vijaya Rangaraju (ETV Bharat)
Published : Jan 20, 2025, 12:40 PM IST
కాగా, 1994లో భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 30 ఏళ్ల కెరీర్లో విలన్, సహాయ పాత్రలు పోషించారు. ముఖ్యంగా గోపిచంద్ 'యజ్ఞం' సినిమాతో రంగరాజుకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో విలన్గా ఆకట్టుకున్నారు.