తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హీరోలుగా మారిన కమెడియన్స్​ - వరుస హిట్లతో యమా జోరు! - Tollywood comedians As Heroes

Tollywood comedians As Heroes : టాలీవుడ్‌లో ప్రస్తుతం పలు కమెడియన్లు హీరోలుగా మారి రాణిస్తున్నారు. మంచి సక్సెస్​లను కూడా అందుకుంటున్నారు. మరి వారెవరు? ఎందులో నటించారో వివరాలను తెలుసుకుందాం.

హీరోలుగా మారిన కమెడియన్స్​ - వరుస హిట్లతో ఫుల్​ జోరు!
హీరోలుగా మారిన కమెడియన్స్​ - వరుస హిట్లతో ఫుల్​ జోరు!

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 12:12 PM IST

Tollywood comedians As Heroes : టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు అవ్వాలనే కోరికతోనే అడుగుపెడుతుంటారు. కానీ ఇతర కారణాల వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా లేదా ఇతర విభాగాల్లో కొనసాగుతుంటారు. అయితే మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్​గానే వచ్చి అనుకోకుండా హీరోలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. వాళ్లే ప్రధాన పాత్రల్లో సినిమాలు చేస్తున్నారు. మరి ఈ తరంలో హీరోలుగా మారిన కమెడియన్లు ఎవరో చూద్దాం.

  • ప్రస్తుతం టాప్ కమెడియన్స్​లో వెన్నెల కిశోర్ ముందుంటారు. ఈయన అతడు ఆమె ఓ స్కూటర్‌తో కథానాయకుడిగా మారారు. మళ్లీ కమెడియన్‌గా కొనసాగించారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ చారి 111తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
  • షార్ట్​ ఫిలిమ్స్​తో కెరీర్‌ ప్రారంభించి, 2018లో పడి పడి లేచె మనసు చిత్రంతో అరంగేట్రం చేశారు సుహాస్. కలర్ ఫొటోతో హీరోగా మారి జాతీయ అవార్డు అందుకున్నారు. అనంతరం ఫ్యామిలీ డ్రామా, రైటర్‌ పద్మభూషణ్‌, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి చిత్రాలతో హిట్ అందుకున్నారు. కేబుల్‌ రెడ్డి, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం వంటి చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తున్నారు.
  • మల్లేశంతో హీరోగా మారిన కమెడియన్‌ ప్రియదర్శి గతేడాది బలగంతో హిట్ అందుకున్నారు. మంగళవారం చిత్రంలోనూ లీడ్ రోల్ పోషించారు. ప్రస్తుతం దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
  • మళ్లీరావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఫేమ్​ అభినవ్‌ గోమటం పాపులర్ డైలాగ్​ మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా. ఈ డైలాగ్​తోనే వచ్చిన సినిమాతో ఆయన హీరోగా మారారు.
  • షార్ట్‌ఫిల్మ్స్​తో కెరీర్ ప్రారంభించిన వైవా హర్ష కూడా రీసెంట్​గా సుందరం మాస్టర్‌ చిత్రంతో హీరోగా మారారు. ఇది బానే ఆకట్టుకుంది. కాగా, మసాలా , ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజాది గ్రేట్‌, పక్కా కమర్షియల్‌, కార్తికేయ 2, బింబిసార సహా తదితర చిత్రాల్లో కమెడియన్​గా నటించారు.
  • జబర్దస్త్‌ మెడియన్ సుడిగాలి సుధీర్ కూడా సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌తో హీరోగా మారారు. తర్వాత గాలోడు, కాలింగ్‌ సహస్రలో ప్రధాన పాత్ర పోషించారు. త్వరలోనే జి.ఒ.ఎ.టితో అలరించనున్నారు.
  • మా ఊరి పొలిమేరతో సత్యం రాజేశ్, బుజ్జీ ఇలారాతో ధనరాజ్‌ కూడా లీడ్ రోల్​లో సినిమాలు చేయడం ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details