Tollywood Chrismas 2024 Movies : గత పదిహేను రోజులుగా బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలానే ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటంటే?
Bachhala Malli Movie Release Date :అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం బచ్చల మల్లి. సుబ్బు మంగదేవి దర్శకుడు. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. రీసెంట్గా రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.
UI The Movie :ఎ, ఉపేంద్ర వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు, హీరో ఉపేంద్ర ఈ సారి యూఐ అనే వినూత్నమైన ఫాంటసీ చిత్రంతో రానున్నారు. ఇది కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న రానుంది. ‘
Viduthalai Part 2 : సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విడుదలై. గతేడాది మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా విడుదలై పార్ట్ 2 వచ్చింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఈ నెల 20న బాక్సాఫీస్ ముందుకు రానుంది.
Sarangapani Jathakam :ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన చిత్రం సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. డిసెంబరు 20న రానుందీ చిత్రం.
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
ఈటీవీ విన్ ఓటీటీలో
లీలా వినోదం (తెలుగు) డిసెంబరు 19
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (హాలీవుడ్) డిసెంబరు 17
ఇనిగ్మా (హాలీవుడ్) డిసెంబరు 17
వర్జిన్ రివర్ 6 (వెబ్‌సిరీస్) డిసెంబరు 19
ది డ్రాగన్ ప్రిన్స్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 18
స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) డిసెంబరు 18