తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం OTTలో తెలుగులో రానున్న క్రేజీ సినిమాలివే - ఆ రెండు వెరీ స్పెషల్! - This Week OTT Telugu Movies - THIS WEEK OTT TELUGU MOVIES

This Week OTT Telugu Movies : వీకెండ్​ దగ్గరికి వచ్చింది. దీంతో కొత్త క్రేజీ సినిమాలు ఓటీటీ రిలీజ్​కు రెడీ అయ్యాయి. అయితే వీటిలో చాలా తెలుగు మూవీస్ ఆడియెన్స్​ను అట్రాక్ట్ చేస్తున్నాయి. మరి ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

source Getty Images
This Week OTT Telugu Movies (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:01 AM IST

This Week OTT Telugu Movies : వీకెండ్​ దగ్గరికి వచ్చింది. దీంతో కొత్త క్రేజీ సినిమాలు ఓటీటీ రిలీజ్​కు రెడీ అయ్యాయి. అయితే వీటిలో చాలా తెలుగు మూవీస్ ఆడియెన్స్​ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలానే పలు డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో స్ట్రీమింగ్​కు వస్తున్నాయి. మరి ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

మహారాజ(Maharaja OTT Telugu Release Date) - తమిళ స్టార్ యాక్టర్​ విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ బ్లాక్​ బస్టర్ హిట్ మహారాజ. ఇందులో విజయ్ సేతుపతి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం లాంగ్ రన్​ టైమ్​లో రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు జూలై 12న నెట్‍ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు.

హరోం హర(Harom Hara OTT Release Date)- సుధీర్​ బాబు నటించిన రీసెంట్​ హిట్​ హరోం హర జూలై 11 నుంచి ఆహా, ఈటీవీ విన్​లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఒకే రోజు రెండు ఓటీటీల్లోనూ రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్​కు ద్వారక జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ హీరోయిన్‍. సునీల్ ఓ కీలక పాత్రలో నటించారు.

ధూమం - మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటించిన ధూమం కూడా స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయింది. జూలై 11న ఆహా ఓటీటీలో రానుంది.

జిలేబీ - నువ్వు నాకు నచ్చావ్​ సహా పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కే విజయ్ భాస్కర్ ఈ జిలేబీని తెరకెక్కించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. జూలై 13 నుంచి ఆహాలోకి రానుంది.

ప్లాట్ -గతేడాది నవంబర్‌లో రిలీజైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మంచి రెస్పాన్స్​ అందుకుంది. వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. జులై 11న ఈటీవీ విన్​లో అందుబాటులోకి రానుంది. భాను భావ తార్కిక దర్శకత్వం వహించారు.

మైదాన్ - బాలీవుడ్ హిట్ సినిమా మైదాన్ రీసెంట్​గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. హైదరాబాదీ లెజెండరీ ఫుట్‍బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్​గా తెరకెక్కింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే తెలుగులోకి అందుబాటులోకి వచ్చింది. జూలై 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. కాగా, ఈ అన్ని సినిమాల్లో మహారాజ, హరోం హర అసక్తిని కలిగిస్తున్నాయి.

టెర్రిఫిక్​ రెస్పాన్స్​తో దూసుకెళ్తున్న విక్రమ్ 'తంగలాన్'​ - ట్రైలర్​లో మీరు ఇది గమనించారా? - Thangalaan Trailer Review

అప్పట్లోనే 25 లక్షల క్యాసెట్లు - భారతీయుడు సాధించిన రికార్డులు తెలుసా? - Bharateeyudu 2 Movie

ABOUT THE AUTHOR

...view details