Sitara Ghattamaneni Interview : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఫొటోస్, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటోంది. ఇటీవల కొందరు డిజిటల్ ఇన్ఫ్లుయోన్సర్లతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది సితార. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. తనలాగానే ఇతర పిల్లలు కూడా చదువుకోవడం చాలా ముఖ్యమని భావిస్తున్నట్లు తెలిపింది సితార. అందుకే బుక్స్, సైకిల్స్ ఉచితంగా అందిస్తానని చెప్పింది.
సితార ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకే- మహేశ్, నమ్రత అస్సలు స్ట్రిక్ట్ కారట! - Sitara Ghattamaneni Favourites - SITARA GHATTAMANENI FAVOURITES
Sitara Ghattamaneni Interview : హీరో మహేశ్ బాబు వారసురాలు సితార ఘట్టమనేని ఫేవరెట్ హీరోయిన్లు ఎవరు తెలుసా? ఆమె ఏం అవ్వాలనుకుంటోంది? ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం.
Published : May 26, 2024, 3:06 PM IST
|Updated : May 26, 2024, 3:38 PM IST
కచ్చితంగా హీరోయినే!
ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే సితారకు స్టైలింగ్ విషయంలో ఎవరు ఇన్‌స్పిరేషన్ అని ఇన్ఫ్లుయోన్సర్లు అడగ్గా, ముందుగా తన తల్లి అని చెప్పింది. తనతో పాటు జూలియా రాబర్ట్స్‌ను కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటానని తెలిపింది సితార. తన ఫేవరెట్ ఫుడ్ మ్యాగీ అని బయటపెట్టింది. "నేను కచ్చితంగా హీరోయినే అవ్వాలని అనుకుంటున్నాను. నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. నేను జ్యువలరీ యాడ్ చేసినప్పుడు, పెన్నీ మ్యూజిక్ వీడియో చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. సెట్స్‌లో బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇంకా చిన్నపిల్లనే కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నాను" అని తన కలలను తెలిపింది సితార.
అమ్మానాన్నలు!
తన కాంటాక్ట్ విషయంలో తన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకొచ్చింది సితార. ఎవరైనా తనను ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే వెంటనే బ్లాక్ చేసేస్తానని తెలిపింది. తన ఫేవరెట్ హీరోయిన్లు రష్మిక మందన్న, శ్రీలీల అని బయటపెట్టింది. తాజాగా మంజుల ఘట్టమనేని, మహేశ్ బాబు జుట్టును టచ్ చేసిన వీడియో వైరల్ అవ్వడంపై కూడా సితార స్పందించింది. నాన్నకు ఎవరైనా హెయిర్ టచ్ చేస్తే అస్సలు నచ్చదని తెలిపింది. అమ్మ దగ్గర నుంచి ఫ్యాషన్ సెన్స్ నేర్చుకుంటానని, నాన్న దగ్గర యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటానని తెలిపింది. ఖలేజాలోని సీతారామరాజు పాత్రను రీక్రియేట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. మహేశ్ బాబు సినిమాల్లో తనకు నచ్చనిది ఏదీ లేదని, అన్నీ నచ్చుతాయని చెప్పుకొచ్చింది. ఇంట్లో అమ్మ, నాన్న ఎవరూ స్ట్రిక్ట్ కాదని చెప్తూ నవ్వింది సితార.