తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రాహుల్ రవీంద్రన్​తో సమంత బీచ్ సాంగ్ - ఇప్పుడిదే ఫుల్ ట్రెండింగ్​! - Samantha Rahul Ravindran Song

Samantha Rahul Ravindran : సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్​ - హీరోయిన్ సమంత కలిసి చేసిన ఓ బీచ్ సాంగ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు షాక్ అవుతున్నారు. దాని గురించే ఈ కథనం.

2010లో సమంతా ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి అందరికీ తెలుసు. ఆ సినిమాలో జెస్సి కారెక్టర్ అంతగా ఆకట్టుకోవడానికి కారణం సమంతా అందంతో పాటు ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి కూడా ఒక కారణం. ఆ తర్వాత చాలా కాలం పాటు సమంతాకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. టాలీవుడ్ ప్రేక్షకులకు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా బాగా పరిచయస్తూడే, 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో పరిచయం అయిన రాహుల్ ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశాడు. మన్మధుడు 2, చిలసౌ వంటి సినిమాలతో డైరెక్టర్ గా మారాడు.  తాజాగా సమంతా, రాహుల్ రవీంద్రన్ కలిసి నటించిన సినిమాలో పాటలు, సన్నివేశాలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఈ సినిమా ఎప్పుడూ తీశారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ట్రెండ్ అవుతున్న ఒక పాట తెలుగులో 2009లో రవితేజ, ఇలియానా నటించిన కిక్ సినిమాలో పాట గోరే గ్గో గోరే లాగా ఉండడం చూసి షాక్ అయ్యి తెగ వైరల్ చేస్తున్నారు. అందరూ అనుకున్నట్టు సమంతా మొదటి సినిమా ఏం మాయ చేసావే కాదు 2007లోనే రాహుల్ రవీంద్రన్ తో మాస్కోవిన్ కావేరీ అనే తమిళ సినిమాలో నటించింది. అయితే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదలలో జాప్యం కారణంగా తెలుగులో ఏం మాయ చేసావే రిలీజ్ అయ్యాక అది విడుదల అయింది. అందుకే అప్పట్లో సమంతా కూడా ఇంటర్వ్యూలలో తన మొదటి హీరో రాహుల్ రవీంద్రన్ అని చెప్పింది.  ప్రస్తుతం సమంతా తనకున్న ఆరోగ్య సమస్య కారణంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది. తను అంతకుముందు నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. రాహుల్ రవీంద్రన్ కూడా ఈ ఏడాది మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో మహేష్ బాబుకి తమ్ముడిగా, వెన్నెల కిషోర్ సినిమా చారి111లో సియంగా కనిపించాడు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 2:59 PM IST

Samantha Rahul Ravindran : 2010లో సమంత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి అందరికీ తెలుసు. ఆ సినిమాలో జెస్సి కారెక్టర్ అంతగా ఆకట్టుకోవడానికి కారణం సమంత అందంతో పాటు ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి కూడా ఒక కారణం. ఆ తర్వాత చాలా కాలం పాటు సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. టాలీవుడ్ ప్రేక్షకులకు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా బాగా పరిచయస్తుడే, 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో పరిచయం అయిన రాహుల్ ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశాడు. మన్మధుడు 2, చిలసౌ వంటి సినిమాలతో డైరెక్టర్ గా మారాడు.

అయితే తాజాగా సమంత, రాహుల్ రవీంద్రన్ కలిసి నటించిన సినిమాలోని ఓ పాట నెట్టింట సందడి చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ సినిమా ఎప్పుడూ తీశారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పాట తెలుగులో 2009లో రవితేజ, ఇలియానా నటించిన కిక్ సినిమాలో పాట గోరే గ్గో గోరే లాగా ఉండడం చూసి షాక్ అయ్యి తెగ వైరల్ చేస్తున్నారు. అందరూ అనుకున్నట్టు సమంతా మొదటి సినిమా ఏం మాయ చేసావే కాదు 2007లోనే రాహుల్ రవీంద్రన్ తో మాస్కోవిన్ కావేరీ అనే తమిళ సినిమాలో నటించింది. అయితే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదలలో జాప్యం కారణంగా తెలుగులో ఏం మాయ చేసావే రిలీజ్ అయ్యాక అది విడుదల అయింది. అందుకే అప్పట్లో సమంతా కూడా ఇంటర్వ్యూలలో తన మొదటి హీరో రాహుల్ రవీంద్రన్ అని చెప్పింది.

ప్రస్తుతం సమంతా తనకున్న ఆరోగ్య సమస్య కారణంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది. తను అంతకుముందు నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. రాహుల్ రవీంద్రన్ కూడా ఈ ఏడాది మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో మహేష్ బాబుకి తమ్ముడిగా, వెన్నెల కిషోర్ సినిమా చారి111లో సియంగా కనిపించాడు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.

సిటాడెల్​ - స్టన్నింగ్​ లుక్స్​తో హీట్ పెంచిన సమంత

సమంత సిటాడెల్ గ్లింప్స్​ - యాక్షన్​ సీన్స్​ అదిరిపోయాయ్​!

ABOUT THE AUTHOR

...view details