తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్‌ లిస్ట్‌ యాక్టర్స్​లో ప్రభాస్​, రామ్​చరణ్​, అల్లు అర్జున్​ - జాబితాలో ఇంకెవరున్నారంటే? - POWER LIST ACTORS - POWER LIST ACTORS

Indian Film Industry Power List Actors :తమ చిత్రాలతో, నటనతో భారతీయ సినిమాను ప్రపంచ యవనికపై నిలబెట్టారు పలువురు నటులు. తాజాగా ఆ పవర్‌ఫుల్‌ యాక్టర్స్‌ జాబితాను విడుదల చేసింది ఆంగ్ల సినీ మ్యాగజైన్‌ ఫిల్మ్ కంపానియన్‌. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Prabhas Ramcharan Alluarjun (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 4:55 PM IST

Indian Film Industry Power List Actors : గత కొంత కాలంగా ఇండియన్​ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. కథ, కంటెంట్ బాగుంటే చాలు ఏ భాషా చిత్రాన్నైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో భాషల మధ్య భేదం చెరిగిపోయింది. అందుకే దర్శక-నిర్మాతలు కూడా తమ సినిమాల్లో ఇతర భాషల నటీనటులను ఎక్కువుగా తీసుకుంటున్నారు.

అయితే రీసెంట్​గా కొందరు సాంకేతిక నిపుణులు, నటీనటులు మన ఇండియన్ సినిమాను ప్రపంచ యవనికపై నిలబెట్టారు. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మన సినిమా అంటే అద్భుతం అనేలా మాట్లాడుకునేలా చేశారు. తాజాగా అలా చేసిన పవర్‌ఫుల్‌ యాక్టర్స్‌ జాబితాను విడుదల చేసింది ఆంగ్ల సినీ మ్యాగజైన్‌ ఫిల్మ్ కంపానియన్‌.

ఆర్మాక్స్​ మీడియాతో కలిసి ఈ లిస్ట్​ను తయారు చేసింది. జనవరి 2021 నుంచి డిసెంబరు 2023 మధ్య తమ సినిమాలు, యాక్టింగ్​తో వార్తల్లో నిలిచిన యాకర్స్​, టెక్నిషియన్స్​ లిస్ట్​ను రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఎవరికి ర్యాంకులు లేవని తెలిపింది.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఈ లిస్ట్​లో స్థానం సంపాదించుకున్నారు.

మొత్తం లిస్ట్ విషయానికొొస్తే రజనీ కాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, అజిత్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌, సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌, యశ్‌, సూర్య, విజయ్‌, ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, అలియా భట్‌, దిలీప్‌ జోషి, కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందాన, రుపాలీ గంగూలీ ఉన్నారు.

పవర్‌ లిస్ట్‌ టెక్నీషియన్స్‌ విషయానికొస్తే సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రే, అనిల్‌ మెహతా, అన్బిరివ్‌, బాస్కో-సీజర్‌, బిశ్వదీప్‌ ఛటర్జీ, గిరీశ్‌ గంగాధరన్‌, ఏకా లహానీ, మనీశ్‌ మల్హోత్ర, జానీ మాస్టర్‌, ముకేశ్‌ ఛబ్రా, మిక్కీ కాంట్రాక్టర్‌, నితిన్‌ బైదీ, నమిత్‌ మల్హోత్ర, రవి వర్మన్‌, పంకజ్‌ కుమార్‌, సాబు శిరిల్‌, రసూల్‌ పూకుట్టి, శ్రీకర్‌ ప్రసాద్‌, శ్రీధర్‌ రాఘవన్‌, సుదీప్‌ శర్మ, సుదీప్‌ ఛటర్జీ, శ్యామ్‌ పుష్కరన్‌, సుజాన్నే కప్లాన్‌ మేర్వాన్జీ, వి.విజయేంద్రప్రసాద్‌, ఉజ్వల్‌ కుల్‌కర్ణి ఉన్నారు.

అనంత్-రాధిక వెడ్డింగ్​లో హీరో యశ్​ కొత్త లుక్​ - సోషల్ మీడియా షేక్​! - KGF Yash Stylish Look

1000 కత్తుల పదునుతో సేనాపతి - కమల్, కాజల్​ కత్తి యుద్ధం చూశారా? - Indian 3 trailer

ABOUT THE AUTHOR

...view details