తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'క' బాక్సాఫీస్ జాతర - ఫస్ట్ వీకెండ్​లోనే లాభాల్లోకి!

కలెక్షన్లలో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం 'క'- ఆదివారానికల్లా బ్రేక్ ఈవెన్!

Kiran Abbavaram  KA
Kiran Abbavaram KA (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Kiran Abbavaram KA Movie : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన కొత్త చిత్రం 'క'. సుజీత్‌ - సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. దీపావళి కానుకగా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్​ను అందుకుని మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 'క' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్లే దొరికినప్పుటికీ మంచి టాక్ రావడం వల్ల ప్రేక్షకులు ఆదరించారు. దీంతో తొలి రోజే ఈ మూవీ రూ.6కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండో రోజు కూడా తొలి రోజుకు మించి కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో 'క' సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సోమవారం నుంచి లాభాలు!
'క' మూవీ ఏపీ, తెలంగాణ హక్కులను నిర్మాత వంశీ నందిపాటి రూ.12కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుడ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అవ్వనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సోమవారం నుంచి వచ్చే కలెక్షలన్నీ లాభాలేనని చెబుతున్నాయి.

ప్రేక్షకులను ఆకట్టుకున్న 'క'
ఇక 'క' సినిమాలో కిరణ్ అబ్బవరంతో పాటు నయన్ సారిక, తన్వీ రామ్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ చక్రాస్ ఎంటర్​టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం భారీగా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ సినిమాను సుజీత్, సందీప్ డైరెక్ట్ చేశారు. టీజర్, సాంగ్స్ కూడా మూవీ లవర్స్​ను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో అక్టోబరు 31న విడుదలైన ఈ మూవీ అద్బుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', శివ కార్తికేయన్ 'అమరన్' వంటి పెద్ద సినిమాలకు తట్టుకుని నిలబడగలిగింది.

డిఫరెంట్ కాన్సెప్ట్
'క' మూవీ కొత్త కాన్సెప్ట్​తో తెరకెక్కింది. సినిమా అంతా ఒకెత్తైతే, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ మరొకెత్తుగా నిలిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ రెండూ ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయేలా చేస్తాయని కొనియాడుతున్నారు. ఓ కొత్త అనుభూతిని అందించాయని అంటున్నారు. ముఖ్యంగా మనిషి పుట్టుక, కర్మ ఫలం, రుణానుబంధం - ఈ మూడు అంశాల్ని ముడిపెట్టిన దర్శకుడు, చివరికి చెప్పిన సందేశం, కథను ముగించిన తీరు చాలా బాగుందని అభిప్రాయపడుతున్నారు. సినిమాలో మధ్యలో వచ్చే కోర్టు యాక్షన్ సీక్వెన్స్, జాతర పాట, క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులను బాగా అలరించాయి.

'చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా' - 'క' సక్సెస్​పై కిరణ్ అబ్బవరం

'క' రివ్యూ - కిరణ్‌ అబ్బవరం కొత్త కాన్సెప్ట్​ సినిమా ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details