Kajol Prabhudeva Movie :కోలీవుడ్ స్టార్ ప్రభుదేవ, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. 'మెరుపు కలలు' సినిమా తర్వాత 'మహారాగ్ని' అనే యాక్షన్ మూవీలో నటించనున్నారు. అయితే ఈ సారి ఈ ఇద్దరూ ప్రేమికులుగా కాకుండా శత్రువులుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్లో వీరి యాక్షన్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.
ఇందులో కాజోల్ ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'అడిగి శక్తిని పొందడం కాదు, పోరాడి పొందాలి' అంటూ కాజోల్ చెప్పే డైలాగ్ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కలగలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరక్టర్.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఉప్పలపాటి చరణ్ తేజ్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేయనున్నారు. మాలీవుడ్ బ్యూటీ సంయుక్త ఇందులో కాజోల్కు చెల్లిగా నటించనుంది. ఇక ఆమె తండ్రి పాత్రను దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా పోషిస్తున్నారు.
జిష్షు సేన్ గుప్తా, ఆదిత్య సీల్, చాయ కదం లాంటి స్టార్స్ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'యానిమల్' సినిమాకు బాణీలు సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. 'జవాన్' కెమెరామెన్ జీకే విష్ణు, 'పుష్ప' ఎడిటర్ నవీన్ నూలి ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాజోల్ ఇటీవలే 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం 'దో పట్టి','సర్జమీన్' సినిమాల్లో నటిస్తోంది. హారర్ చిత్రం 'మా' లోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రభుదేవా కూడా వరస ప్రాజెక్టుల్లో మెరుస్తున్నారు. తమిళ నటుడు దళపతి విజయ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలో ఆయన నటిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టుల్లోనూ ఆయన సందడి చేస్తున్నారు.
షారుక్, కాజోల్ కాదు - బీటౌన్‌లో ఈ హిట్ పెయిరే ఫేమస్! - Actress Most Films With Shahrukh
'ఒకప్పుడు హీరోయిన్లకు ఆ కొలతలు చూసేవారు!'