KA Movie OTT Release :టాలీవుడ్ యంగ్ హీరోలీడ్ రోల్లో దీపావళి కానుకగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'క'. మరో రెండు భారీ సినిమాలతో పోటీపడ్డ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా దూసుకెళ్లింది. స్టోరీ, హీరో యాక్టింగ్తో పాటు పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వల్ల ఈ సినిమా డే 1 నుంచి మంచి టాక్ అందుకుంది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్' వేదికగా ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. డాల్బీ విజన్ : అట్మాస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్కు రానున్నట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.
కథేంటంట :
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటుంటాడు. అలా ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడంటూ మాస్టర్ గురునాథం (బలగం జయరాం) వాసును కొట్టడం వల్ల ఆశ్రమం నుంచి పారిపోతాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు వాసు కృష్ణగిరికి వచ్చి అక్కడ ఓ కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో వాసుదేవ్ ప్రేమలో పడతాడు.