తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూమర్స్​కు ఐశ్వర్యా రాయ్ ఫుల్ స్టాప్​! - ఐదు నెలల తర్వాత రీఎంట్రీ - AISHWARYA RAI WISHES AMITABH

ఒక్క పోస్ట్​తో ఆ రూమర్స్​కు చెక్ పెట్టిన ఐశ్వర్యా రాయ్​ - ఫ్యాన్స్ ఫుల్ ఖుష్​

source ANI and Associated Press
Amitabh Bachchan Aishwarya Rai (source ANI and Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 9:08 AM IST

Aishwarya Rai wishes Amitabh Bachchan : బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ అక్టోబర్‌ 11న తన 82వ పుట్టిన రోజును గ్రాండ్​గా చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలానే పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు స్పెషల్ బర్త్​ డే విషెస్‌ చెప్పారు. అయితే ఈ విషెస్​లో బిగ్ బీ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ పెట్టిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. అలానే ఈ ఒక్క పోస్ట్​తో గత కొద్ది రోజులుగా వస్తోన్న రూమర్స్​కు కూడా చెక్​ పెట్టింది.

ఐశ్వర్య ఆలస్యంగా నిన్న రాత్రి 11.30 నిమిషాలకు తన మామయ్య బిగ్​బీకి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఆరాధ్యతో అమితాబ్ దిగిన ఓ పాత ఫొటోను షేర్‌ చేసి విషెస్ తెలిపారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ, ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్య రాసుకొచ్చింది.

ఐశ్వర్య తన భర్త అభిషేక్ నుంచి విడిపోనుందంటూ, బిగ్​ బీ కుటంబం నుంచి వేరు కానుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య నిన్న రాత్రి వరకు విషెస్‌ చెప్పకపోవడంతో సోషల్‌ మీడియాలో వస్తోన్న రూమర్స్‌ మరోసారి బలం చేకూరింది. ఈ క్రమంలోనే రాత్రి ఐశ్వర్య పెట్టిన పోస్ట్‌తో మరోసారి రూమర్స్​కు చెక్​ పడినట్టైంది.

ఐదు నెలల తర్వాత - పైగా ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్యా రాయ్​ గత ఐదు నెలలుగా యాక్టివ్​లో లేదు. ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. మే నెలలో తాను మేకప్‌ వేసుకుంటున్న ఫొటోలను షేర్‌ చేసిన ఆమె ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. తన ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.

ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అమితాబ్‌ బచ్చన్​ను ఉద్దేశించి ఆమె పోస్ట్‌ పెట్టడంతో బిగ్​ బీ అభిమానులు సంబరపడుతున్నారు. దీంతో వారి అభిమానాన్ని నెట్టింట్లో కామెంట్స్‌ రూపంలో తెలియజేస్తున్నారు. "చాలా రోజుల తర్వాత మీ పోస్ట్ మళ్లీ చూసినందుకు ఎంతో ఆనందంగా ఉంది" అని ఒకరు కామెంట్‌ పెట్టగా, ‘మీపై వస్తున్న రూమర్స్‌కు మీ స్టైల్‌లో చెక్‌ పెట్టారు' అని మరో అభిమాని రాసుకొచ్చారు.

'జ‌న‌క అయితే గ‌న‌క‌' రివ్యూ - సుహాస్​ కొత్త సినిమా మెప్పించిందా?

'జిగ్రా' రివ్యూ - అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details