SBI Foundation Scholarship 2024:చదివేంత సత్తా ఉన్నా.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక చాలామంది చదువును మధ్యలోనే ఆపేస్తుంటారు. ఉన్నత చదువులు చదివి గొప్ప స్థితిలో ఉండాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ.. పేదరికం వారికి అడ్డుగా నిలుస్తుంటుంది. అలాంటి ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫౌండేషన్.. స్కాలర్షిప్స్ ప్రకటించింది. ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 3వ ఎడిషన్ పేరిట దేశవ్యాప్తంగా ఉపకారవేతనాలను అందించనుంది. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్లు.. అర్హతలేంటి? లాస్ట్ డేట్ ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
విద్యార్థులు అప్లై చేసేందుకు అర్హతలు..
- భారతీయులు మాత్రమే అప్లై చేసుకునేందుకు అర్హులు.
- అప్లై చేసుకునే వారు ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో డిగ్రీ/పీజీ చేస్తూ ఉండాలి. (ఏ ఇయర్ అయినా ఫర్వాలేదు.)
- అయితే.. NIRF ర్యాకింగ్స్లో టాప్ 100 విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులే ఇందుకు అర్హులు.
- గత విద్యా సంవత్సరంలో కనీసం 75శాతం మార్కులు వచ్చి ఉండాలి.
- స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6లక్షలు దాటకూడదు. (రూ. 3లక్షల ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యం)
- ఎస్సీ, ఎస్టీ కేటగీరిలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు:
- గత విద్యా సంవత్సరం మార్క్‌షీట్
- ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్)
- ప్రస్తుత ఏడాది కట్టిన ఎడ్యుకేషన్ ఫీజు రశీదు
- ప్రస్తుత అడ్మిషన్ లెటర్
- బ్యాంకు అకౌంట్ వివరాలు (పిల్లలకు లేకపోతే తల్లిదండ్రుల అకౌంట్)
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- అభ్యర్థి పాస్‌ఫొటో
- కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సివస్తే)
ఎలా అప్లై చేసుకోవాలి?
- ముందుగా sbifashascholarship.org అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- Scholarships కాలమ్‌లో SBIF Asha Scholarship Program for Undergraduate Students/Postgraduate Students పై క్లిక్ చేయండి.
- అందులో కింద కనిపించే Apply Now ఆప్షన్‌పై క్లిక్ చేయండి. వేరే పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. మీరు ఇదివరకే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. లేదంటే Register ఆప్షన్‌పై క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి Registration పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆ వివరాలతో Buddy4Study లో లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత SBIF Asha Scholarship Program 2024 అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేసి.. ప్రివ్యూ చూసి సబ్మిట్ చేయాలి.