SAIL Engineering Jobs 2024 :ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 314 ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ ట్రైనీ (ఓసీటీటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఓసీటీటీ ఉద్యోగాల వివరాలు
- మెటలర్జీ - 57 పోస్టులు
- ఎలక్ట్రికల్ - 64 పోస్టులు
- మెకానికల్ - 100 పోస్టులు
- ఇన్స్ట్రుమెంటేషన్ - 39 పోస్టులు
- సివిల్ - 18 పోస్టులు
- కెమికల్ - 18 పోస్టులు
- సిరామిక్ - 6 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ - 8 పోస్టులు
- కంప్యూటర్/ఐటీ - 20 పోస్టులు
- డ్రాఫ్ట్స్మెన్ - 2 పోస్టులు
- మొత్తం పోస్టులు - 314
విద్యార్హతలు
SAIL Jobs Eligibility : సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, మెటలర్జీ, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ఓసీటీటీ డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు ఒక ఏడాదిపాటు డ్రాఫ్ట్స్మెన్గా పని చేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి
SAIL Jobs Age Limit :అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
SAIL Job Application Fee :
- జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీకి చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఎక్స్-సర్వీస్మెన్ దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.