RRC NR Apprentice Recruitment 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్‌షాప్, యూనిట్లలో ఖాళీగా ఉన్న 4096 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్ఆర్సీ వర్క్‌షాప్‌లు :క్లస్టర్ లఖ్‌నవూ, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ మొరాదాబాద్, క్లస్టర్ దిల్లీ, క్లస్టర్ ఫిరోజ్‌పుర్
ట్రేడ్లు : ఎలక్ట్రీషియన్, మెకానికల్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హామర్ మ్యాన్, టర్నర్, క్రేన్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్
విద్యార్హతలు
RRC NR Apprentice Job Eligibility :అభ్యర్థులు పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
RRC NR Apprentice Job Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్ 16 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
RRC NR Apprentice Job Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం
RRC NR Apprentice Selection Process :పదో తరగతి, ఐటీఐల్లో వచ్చిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను వడపోస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
RRC NR Apprentice Application Process :
- అభ్యర్థులు ముందుగా RRC NR అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- యాక్ట్ అప్రెంటీస్ జాబ్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 16
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్ 16
- మెరిట్ జాబితా వెల్లడి : 2024 నవంబర్
వెస్ట్రన్ రైల్వేలో 'స్పోర్ట్స్ కోటా' పోస్టులు - రాత పరీక్ష లేదు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Sports Quota Jobs
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఇండియన్ బ్యాంక్‌లో 300 ఆఫీసర్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - Indian Bank Notification 2024