తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ - రైల్వేలో 9000 ఉద్యోగాలు - రిక్రూట్​మెంట్​ షెడ్యూల్ ఇదే!

RRB Technician Recruitment 2024 : రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు ఆ శాఖ గుడ్​ న్యూస్ అందించింది. త్వరలో 9000 టెక్నీషియన్​ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్​ఆర్​బీ తన అధికారిక వెబ్​సైట్​లో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ప్రకటించింది? ఆ వివరాలు మీ కోసం.

RRB Technician Recruitment 2024
RRB Technician Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 11:00 AM IST

RRB Technician Recruitment 2024 : రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్​న్యూస్​. త్వరలో టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు వెల్లడించింది. సుమారు 9,000 టెక్నీషియన్ పోస్టులు ఉన్నట్లు ఆర్​ఆర్​బీ పట్నా పేర్కొంది. ఈ మేరకు నియామక షెడ్యూల్​ను తాజాగా విడుదల చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

​ పట్నా రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించింది. మీరు పట్నా ఆర్​ఆర్​బీ అఫీషియల్ వెబ్​సైట్​ను సందర్శించి కూడా ఆయా వివరాలను తెలుసుకోవచ్చు. రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం 9000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని పట్నా ఆర్​ఆర్​బీ వెల్లడించింది. అయితే టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​కు సంబంధించి పూర్తి వివరాలను ఫ్రిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ న్యూస్​లో ప్రచురిస్తారని తెలిపింది. ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చిలో ప్రారంభం అయ్యి ఏప్రిల్​​లో ముగుస్తుందని ఆర్​ఆర్​బీ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

రైల్వేశాఖ జారీచేసిన అధికారిక ప్రకటన వివరాలివే!
రైల్వేశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఆర్​ఆర్​బీ టెక్నీషియన్​ పోస్టులకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇది టెంటేటివ్(తాత్కాలిక క్యాలెండర్) అని రైల్వేశాఖ తెలిపింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య : 9000
  • ఎంప్లాయ్​మెంట్ న్యూస్​లో నోటిఫికేషన్​ ప్రచురించే తేదీ : 2024 ఫిబ్రవరి
  • ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి- ఏప్రిల్
  • కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్​లు(సీబీటీ) నిర్వహణ : అక్టోబర్- డిసెంబర్​
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్​ తేదీ :2025 ఫిబ్రవరి

నోటిఫికేషన్​ విడుదల గురించి రైల్వేశాఖ ఏమన్నదంటే!
'టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డులు సెంట్రలైడ్జ్​ నోటిఫికేషన్ విడుదల చేసే పనిలో ఉన్నాయి. త్వరలోనే ఈ నోటిఫికేషన్​ను విడుదల చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాము. రైల్వేశాఖ ఆఫీషియల్ వెబ్​సైట్​ను తరచుగా చెక్​చేయాలని ఈ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను కోరుతున్నాం. సమయానుకూలంగా అధికారిక వెబ్​సైట్​లో రానున్న నోటిఫికేషన్లకు సంబంధించి అప్​డేట్లను పెడుతుంటాం' అని రైల్వేశాఖ తన అధికారిక వెబ్​సైట్​లో తెలిపింది. ఆయా నోటిఫికేషన్లకు సంబంధించిన అర్హత, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు మొదలైన వివరాలను ఆయా రీజనల్ ఆర్​ఆర్​బీల అధికారిక వెబ్​సైట్లలో పొందుపరుస్తామని తెలిపింది.

ప్రభుత్వ రంగ బీమా సంస్థ NIACLలో 300 అసిస్టెంట్​ పోస్టులు - దరఖాస్తు చేయండిలా!

ఇంజినీరింగ్ అర్హతతో NTPCలో 223 పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details