RRB Technician Jobs 2024 :రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) 9144 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుది.
ఉద్యోగాల వివరాలు
- టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ : 1092 పోస్టులు
- టెక్నీషియన్ గ్రేడ్-3 సిగ్నల్ : 8052 పోస్టులు
- మొత్తం పోస్టులు : 9144
విద్యార్హతలు
RRB Technician Job Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది.
వయోపరిమితి
RRB Technician Job Age Limit :
- టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్లు - 36 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- టెక్నీషియన్ గ్రేడ్-3 సిగ్నల్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్లు - 33 ఏళ్లు మధ్యలో ఉండాలి.
పరీక్ష ఫీజు
RRB Technician Job Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.500 చెల్లించాలి.
- మహిళలు, మాజీ సైనికులు, ఈబీసీ, మైనారిటీ, ట్రాన్స్జెండర్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
RRB Technician Selection Process :అభ్యర్థులకు ఫస్ట్, సెకండ్ స్టేజ్ల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, వీటన్నింటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను టెక్నీషియన్ పోస్టులకు ఎంపిక చేస్తారు. వీరు దేశంలో రైల్వే రీజియన్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.