తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

మీకు తెలుసా? : ఇంటర్వ్యూ ఫెయిలైతేనే కాదు- అన్ని ప్రశ్నలకూ సరైన ఆన్సర్స్ చెబితే కూడా ఉద్యోగం రాదట!

-నైపుణ్యాలు, అనుభవం ఎక్కువగా ఉన్న రిస్కే! -మహిళా టేకీకి వింత అనుభవం

Overqualified Tech Rejection
Overqualified Tech Rejection (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Overqualified Tech Rejection : కార్పొరేట్​ సంస్థల్లో జాబ్​ చేసే చాలా మంది ఉద్యోగంలో అనుభవం సంపాదించి, స్కిల్స్​ నేర్చుకున్న తర్వాత కంపెనీ మారుతుంటారు. దీనివల్ల జీతం పెరగడంతోపాటు, సీనియర్‌ పొజిషన్‌ వస్తుందని భావిస్తుంటారు. అయితే, ఇటీవల గూగుల్​లో​పని చేసిన ఓ మహిళా టెకీ.. స్టార్ట్​ప్​ కంపెనీలోఉద్యోగానికి అప్లై చేసుకుంది. అందులో పక్కా జాబ్​ వస్తుందని ఆశించిన ఆమెకు వింత అనుభవం ఎదురైంది.

ఆమె రెజ్యూమెను పరిశీలించిన రిక్రూటర్లు.. "ఓవర్‌ క్వాలిఫైడ్‌, ఈ ఉద్యోగం మీకు ఇవ్వలేము"అని తేల్చిచెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్​కి గురైన ఆమె తన అనుభవాల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే, కార్పొరేట్‌ సంస్థలు.. తాము ఆఫర్‌ చేసిన జాబ్‌ రోల్‌కు మించిన విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం ఉన్నా.. రిజెక్ట్​ చేయడానికి గల కారణాలను నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ​

  • ఉద్యోగ అర్హతలు ఎక్కువగా ఉన్నప్పుడు రిజెక్ట్​ చేయడం కార్పొరేట్​ ప్రపంచంలో సాధారణం.
  • ఎక్కువ అర్హతలున్న వారిని రిక్రూట్‌ చేసుకుంటే.. తాము చేసే జాబ్​లో సంతృప్తి లోపించి ఉత్తమమైన అవకాశాల కోసం అన్వేషణ సాగిస్తుంటారట ఉద్యోగులు.ఇలాంటి వారు త్వరగా తమ సంస్థ నుంచి బయటికి వెళ్లిపోతారని, ఈ క్రమంలో వారిపై పెట్టిన పెట్టుబడి, టైమ్​ వృథా అవుతాయని భావించి కంపెనీలు వారికి ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరిస్తుంటాయట!
  • ఒకే తరహా జాబ్​ కోసం ఎక్కువ, తక్కువ స్కిల్స్​, అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసుకుంటే.. అధిక అర్హతలున్న వారు తమ కంటే తక్కువ అర్హతలున్న వారితో కలిసి పనిచేయలేకపోతారట! దీనివల్ల వారికి వర్క్​లో సంతృప్తి లేకపోగా, పని ప్రదేశంలో ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా లోపిస్తుంది. అందుకే ఇలాంటి వారికి ఉద్యోగం ఇవ్వవట సంస్థలు.
  • స్కిల్స్​, అనుభవం ఎక్కువగా ఉన్న వారిలో చాలామంది.. తమ కంటే తక్కువ స్థాయి ఉద్యోగులపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుంటారు. దీనివల్ల కూడా పని వాతావరణంలో అలజడి ఏర్పడుతుందన్న ముఖ్యోద్దేశంతోనే అర్హతలు అధికంగా ఉన్న వారికి జాబ్​ ఇవ్వవట కొన్ని సంస్థలు.
  • అర్హతలు ఎక్కువగా ఉన్న వారు అప్పటికప్పుడు ఉత్సాహంతో జాబ్​లో చేరినా.. కొన్నాళ్లకు వారిలో ఆసక్తి తగ్గుతుంది. తమకున్న అర్హతలతో పోల్చితే తాము చేసే పని తక్కువనే ఫీలింగ్​ కలుగుతుంది. ఇది పని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, పరోక్షంగా కంపెనీ ఉత్పాదకతపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని కంపెనీలు భావిస్తుంటాయి. అందుకే ఇలాంటి వారిని రిక్రూట్‌ చేసుకోవడానికి కొన్ని సంస్థలు వెనుకంజ వేస్తుంటాయి.
  • ఉద్యోగానుభవం, విద్యార్హతలు ఎక్కువగా ఉన్నప్పుడు శాలరీ కూడా ఎక్కువగా ఆశించడం సహజమే! అయితే ఇందుకు ఆ సంస్థలు సన్నద్ధంగా లేకపోవడం వల్ల కూడా వారికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తుంటాయి. ఇది కూడా జాబ్​ రిజెక్ట్​ చేయడానికి ప్రధాన కారణం.
  • మన అర్హతలకు తక్కువగా ఉన్న జాబ్​లో చేరడం వల్ల.. నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకోలేమేమో అన్న నిరుత్సాహం ఆవహిస్తుంది. ఇది ఉద్యోగ జీవితంలో బోర్‌గా ఫీలయ్యేలా చేస్తుంది. దీనివల్ల పనిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ముందే గ్రహించే రిక్రూటర్లు.. ఇలాంటి ఓవర్‌ క్వాలిఫైడ్‌ ఉద్యోగులకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రారని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details