ITBP Recruitment 2024 : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నాన్ గెజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) గ్రూప్-సీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
- హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) (పురుషులు/ మహిళలు) : 09 పోస్టులు
- కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) (పురుషులు/ మహిళలు) : 115 పోస్టులు
- కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) (పురుషులు మాత్రమే) : 4 పోస్టులు
- మొత్తం పోస్టుల సంఖ్య : 128
విద్యార్హతలు
- హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీ సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి.
- కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి
- హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్ 10 నాటికి 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్ 10 నాటికి 18 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.