తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఉపాధికి దిక్సూచి ఈ కోర్సులు- పూర్తి చేస్తే రూ.లక్షల్లో జీతాలు!

Highest Salary Courses : ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఉద్యోగ సాధనలో ఇతరులతో పోటీ పడాలంటే ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరి. అయితే జాబ్​ మార్కెట్​లో అత్యధిక వేతనాన్ని పొందేందుకు ఉపయోగపడే కోర్సులు ఏవి? రిక్రూటర్లు మీ ప్రొఫైల్​ను సెలెక్ట్ చేయాలంటే ఏయే కోర్సు చేయాలి? అనే వివరాలు మీకోసం.

Highest Salary Courses
Highest Salary Courses

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 8:23 AM IST

Highest Salary Courses :చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం రాలేదని నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు ప్రస్తుతం జాబ్​ మార్కెట్​లో అత్యధిక డిమాండ్​ ఉన్న కోర్సులను చేస్తే వేగంగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. దీంతో పాటు అత్యధిక వేతనం వచ్చే ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నిపుణుల​ అభిప్రాయం ప్రకారం 2024లో జాబ్​మార్కెట్​లో అత్యధిక డిమాండ్​ ఉన్న కోర్సులు డేటా సైన్స్​, బిజినెస్ అనలిటిక్స్​. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అసలేంటీ డేటా సైన్స్?
ప్రస్తుత సమాచార సాంకేతిక విప్లవంలో డేటా సైన్స్​ అన్నిరంగాలకు విస్తరించింది. పెద్ద మొత్తంలో డేటాను సేకరించి విశ్లేషించడమే ఈ డేటా సైన్స్ పని. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ కోర్స్​. స్ట్రక్చర్డ్​, అన్​స్ట్రక్చరిడ్​ డేటా నుంచి వివిధ శాస్త్రీయ పద్ధతులు, అల్గారిథంలు ద్వారా సమాచారాన్ని విశ్లేషిస్తారు. దీనినే డేటా సైన్స్​ కోర్స్​ అంటారు. వీటికి జాబ్​మార్కెట్​లో చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అత్యధిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఈ రంగంలో ఉద్యోగం సాధించాలంటే గణాంకాలు, మ్యాథ్స్​, కంప్యూటర్ సైన్స్, ఇన్​ఫర్మేషన్ థియరీ వంటి సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉండాలి.

బిజినెస్ అనలిటిక్స్​
వివిధ డేటా విశ్లేషణ పరికరాలు, టెక్నిక్​లు, పద్ధతుల ద్వారా సమాచారాన్ని విశ్లేషించి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహాలను అమలు చేయడానికి డాటా అనలిటిక్స్ అస్త్రం లాంటిది. ప్రస్తుతం శక్తిమంతమైన ఉద్యోగాల్లో ఒకటిగా మార్పు చెందింది. అందువల్ల ఈ సాంకేతికతపై పట్టున్నవారు మంచి జాబ్​ సాధించడం సులువే. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో నైపుణ్యాన్ని పొందితే ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చు.

ఈ కోర్సులను అందించే సంస్థలు, ఫీజుల వివరాలు
మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న డేటాసైన్స్​, బిజినెస్​ అనలిటిక్స్​లో కోర్సులను అందించే సంస్థలు, ఫీజుల వివరాలు ఇవే.

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్​ డేటా సైన్స్​

  • విద్యాసంస్థ : ఐఐఐటీ బెంగళూరు
  • కోర్సు ఫీజు : రూ.3.25 లక్షలు (జీఎస్​టీతో కలిపి)
  • కోర్సు వ్యవధి : 12 నెలలు
  • ఈ సంస్థ ప్లేస్​మెంట్​ గణాంకాల​ ప్రకారం శాలరీ హైక్ 57% , అత్యధిక వేతన ప్యాకేజీ 1.23 కోట్లు.

2. ఎంబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్

  • విద్యా సంస్థ : బిట్స్ పిలానీ
  • ఫీజు : రూ.2.5 లక్షలు,
  • కోర్సు వ్యవధి : 18 నెలలు
  • బిజినెస్​ అనలిటిక్స్​లో ఎంబీఏ కోర్సును బిట్స్​ పిలానీ ప్రొఫెషనల్స్​ కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • ఈ కోర్సులో భాగంగా నాలుగు సెమిస్టర్ల ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రొగ్రామ్​ ఉంటుంది.

3. అడ్వాన్సిడ్​ మేనేజ్​మెంట్ ప్రొగ్రామ్​ ఇన్​ బిజినెస్​ అనలిటిక్స్​

  • కోర్సును ఆఫర్​ చేస్తున్న సంస్థ : ఐఎస్​బీ
  • కోర్సు ఫీజు : రూ. 11 లక్షలు
  • అప్లై చేయడానికి చివరి తేదీ : 2024 జనవరి 28.
  • ఈ కోర్సు క్లాస్​రూమ్​, టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్ ప్రొగ్రాం.

ఛాలెంజింగ్ జాబ్స్ చేయాలా? 2024లో ఉన్న టాప్-6​ కెరీర్ ఆప్షన్స్ ఇవే!

గూగుల్​లో ఉద్యోగం కావాలా? అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details